
HARITHA NAANEELU
₹60
In stock · 9 available
PublisherBOMMU UMAMAHESWARA REDDY
LanguageTelugu
అందరికీ నమస్కారం! ‘హరిత నానీలు' నా తొలి నానీల కవితా సంపుటి. దేశానికి వెన్నెముక రైతన్న. రైతు కుటుంబంలో జన్మించిన నేను, కాలానుగుణంగా రాసిన నానీలను మీ ముందుంచాను. చదివి, మీ అమూల్యమైన అభిప్రాయం నాకు తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ముందుమాటతో ఆశీస్సులు అందించిన 'నానీల నాన్న' ఆచార్య ఎన్.గోపి గారికి, 'నానీల చిన్నాన్న' సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. మా పెద్దబ్బాయి బొమ్ము నాగ నవీన్ రెడ్డికి కోడలు బొమ్ము రమ్య మరియు చిన్నబ్బాయి బొమ్ము గౌతమ్ రెడ్డికి, కోడలు లక్ష్మీశ్రావణికి శుభాశీస్సులు. ఈ ప్రయత్నానికి సహకరించిన నా శ్రీమతి బొమ్ము రాజేశ్వరికి ప్రేమాంజలి. నా శ్రేయోభిలాషి, మార్గదర్శకులు అధికారభాషాసంఘం మాజీ సభ్యులు శ్రీ మోదుగుల పాపిరెడ్డి గారికి నమస్సుమాంజలి. ఈ ‘హరిత నానీలు' ముచ్చటగా ముద్రించిన ప్రచురణకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు. గుంటూరు జిల్లా రచయితలకీ, మిత్రులకీ నా ప్రత్యేక నమస్సులు.