HARIVILLU - 80 by AMARJEE Telugu book cover

HARIVILLU - 80

by AMARJEE

₹80
In stock · 9 available
PublisherMALLETEEGA
LanguageTelugu
హరివిల్లు అమరోజీ కవిత్వం సామాజిక సమస్యలపై అమరీ కలం సాగించిన యుద్ధమే 'హరివిల్లు' కవిత్వం. అదీ ఇదీ అని కాదు...తాను జీవిస్తున్న సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నిటినీ కవిత్వం చేశారు. 'వృద్ధులు ఎండుటాకులు కాదు.. ఉపయోగిస్తే అవి ఎంతో మంచి ఫలితాలనిస్తాయి' అంటారు. వివాహ బంధాలకు కీలకం ఏడడుగులేనంటూ..నేడు దండల మార్పిళ్ళు, రిజిస్ట్రార్ పెళ్ళిళ్ళు.. సహజీవనాలంటూ అడుగులతో పని లేని వివాహ బంధాలు పెనవేసు కుంటున్నాయని కలత చెందుతారు అమర్. వీధుల్ని చెత్తతో నింపుతున్న కొంతమంది నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతారు. అలాగే స్వలాభం కోసం వస్తువుల్ని కల్తీ చేసి అమ్ముతున్న వ్యాపారస్తుల దోపిడీని ప్రశ్నించారు. సామాజిక బాధ్యతతో అందిం చాల్సిన విద్యను కాసులకు అమ్మేయడం క్షమించరాని నేరమంటూ విద్యావేత్తలకు చురకలంటించారు. సామ్యవాదం, సమసమాజం, సమాజ సంక్షేమమే లక్ష్యంగా రాసిన అమరో కవిత్వంలో వాడి వుంది.. వేడి వుంది. ఆవేశమూ, ఆలోచనా వుంది. వివిధ రంగుల మిశ్రమం 'హరివిల్లు'... వివిధ సమస్యలపై కదంతొక్కిన కవిత్వం 'హరివిల్లు'.