
HASTA LAKSHANA PADALU
₹50
In stock · 15 available
PublisherSTREE SAKTHI PRACHURANALU
LanguageTelugu
ఆరుద్ర 'హస్తలక్షణ - లక్ష్య' పదముల పరిచయం డా|| ఆరుద్రతో నాకు వ్యక్తిగత పరిచయం 1980లలో ఏర్పడింది. మంచి కవి, సినీ గీతాల మేటి రచయిత అని ఆయన గురించి విన్నాను. మా తండ్రిగారైన దర్శకులు శ్రీ కె. సుబ్రహ్మణ్యంగారికి ఆరుద్ర మంచి మిత్రులు. నేను శ్రీ కృష్ణగానసభలో తొలి నాట్యకళ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రోజూ తప్పకుండా ప్రతి సెషన్కు వచ్చి కూర్చుని చూసే ఆరుద్రను చూసి ఆశ్చర్యపడ్డాను. చెన్నమ్లోని మా నృత్యోదయ సంస్థ, బొంబాయిలోని భులభాయ్ దేశాయ్ సంస్థతో కలిసి మొదటి మూడు సంవత్సరాలూ నాట్య కళా సమావేశాలు శ్రీ కృష్ణగానసభలో ఏర్పాటు చేసింది. థియేటర్, నాట్యం మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో శ్రీ ఆరుద్ర కనపరచిన కుతూహలం నాకు ఆశ్చర్యం కలిగించింది. నెమ్మది నెమ్మదిగా ఆయన బహు విషయ పరిజ్ఞానం నాకు అర్థం అవుతూ వచ్చింది. మేధావి వర్గంలో నేను యీయనవంటి "ఎల్లలులేని పరిధి" కల విజ్ఞానిని చూడలేదు. లోతైన వారి జ్ఞానం - పై పై మెరుగులతో మెప్పులకై డాంబికంగా ప్రదర్శనకు - కనబడనిది. వామపక్షవాదినని డా॥ ఆరుద్ర చెప్పుకున్నా, మన సంప్రదాయక కళల విలువలపట్ల, వేదాంతం పట్ల వారికి వున్న విలువైన పరిజ్ఞానం ఆరుద్రను వైవిధ్యం ఉన్న అత్యాధునిక కవిని చేసింది. బహు భాషా కోవిదుడై సంస్కృతం, తమిళం, ఆంగ్లంలో సాధికారంగా వ్రాయకల్గినా, తెలుగులోనే రాశారు. ఆయన నన్ను "దీక్షాగురు" అని పిలవడం ప్రారంభించినప్పటినుండి, వారి వినమ్రత నాకెన్నోమార్లు ఆశ్చర్యం కల్గించింది. తొలి మూడు నాట్య కళా సమావేశాలూ ఆరుద్రకు ఒక కనువిప్పుగా తోచాయి. నాట్య పద్ధతులలో, వాటి చరిత్రలో వారి కుతూహలం హెచ్చింది. 'సదిర్ నుండి భరత నాట్యం' వరకు జరిగిన - రూపాంతరంపై నేనిచ్చిన అనేక ఉపన్యాసాలూ, తంజావూరు సోదరులు - కాలం వారి పాత్ర విన్నాక ఆరుద్రలో - ఉత్సాహం ద్విగుణీకృతమై ఈ విషయం యింకా లోతుగా పరిశీలించి, పరిశోధించి - సాధికారికమైన వ్యాసాలను వ్రాయడానికి ప్రోత్సహించింది.