
HASTASAMUDRIKA PRAKASHAM
₹30
In stock · 9 available
PublisherSRISHTI SESHAGIRI
LanguageTelugu
హస్త సాముద్రిక ప్రకాశం ముందు మాట : జ్యోతిష్య శాస్త్రంలో జాతక చక్రం వేయుటకు సాధారణంగా మనకు వ్యక్తి యొక్క పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు పుట్టిన ప్రాంతం అవసరం. అవి లేనిచో జాతక చక్రం వేయలేము. ఫలితాలు చెప్పలేము. కానీ అవి లేనివారు అనగా ఈ డేట్ ఆఫ్ భర్త్, టైం ఆఫ్ భర్త్, ప్లేస్ ఆఫ్ భర్త లేనివారు, ఈ ప్రపంచంలో చాలా మందే వున్నారు. మరి అట్టి వారి పరిస్థితి ఏంటి? వారికీ తమ జాతకం తెలుసుకోవాలని, భవిష్యత్తును గురించి ఆశ ఉంటుంది సహజంగానే. కానీ అది నెరవేరాలంటే సరైన జన్మ వివరాలు కావాలి. అటువంటప్పుడు వారేం చేయాలి. వారికి వున్న మరో మార్గం ఏమిటి ? అనగా అదే ఈ హస్తసాముద్రిక శాస్త్రం. ఈ శాస్త్రంలో వ్యక్తికి ఏ జన్మవివరాలు లేకున్నా సరే, కేవలం అరచేతిలోని రేఖఁ ద్వారా తమ భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. అంతేకాక ఈ శాస్త్రంలో కూడా ఎన్నో రెమిడీస్ ను సూచించవచ్చు. మరియు జాతకుడి జీవితంలో జరగబోవు ఎన్నో విషయాలను గురించి ప్రస్థావించవచ్చు. జాతక జ్యోతిష్యంలో కొంత సమయం తేడాతో లగ్నం మారును. అపుడు జాతకంలో కాస్త తేడా వచ్చును. కానీ అదే ఈ శాస్త్రంలో అటువంటి అవకాశంలేదు. అందుకే ఈ శాస్త్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు, ఆధరణ లభించింది. ఈ చిన్న పుస్తకంలో కొంత మేరకైనా నాకున్న జ్ఞానాన్ని ప్రంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాన్ని ఆధరిస్తారని ఆశస్తూ... మీ శ్రిష్టి శేషగిరి