HASTASAMUDRIKA SASTRAM REKHA SASTRAM by N R GOPAL SARMA Telugu book cover

HASTASAMUDRIKA SASTRAM REKHA SASTRAM

by N R GOPAL SARMA

₹30
In stock · 9 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
శాస్త్ర పరిచయము గత కొన్ని వందల, వేల సంవత్సరముల క్రితం నుండి కూడా ఈ శాస్త్రం వాడుకలో ఉన్నది. ప్రతీ మనిషి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకొంటాడు. రాజు అయినా, పేదవాడైనా తన భవిష్యత్తు తెలుసుకోవాలని కోరుకొంటాడు. తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే జ్యోతిషశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, సంఖ్యా శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రం ఇవి అన్నియు కూడా మన భవిష్యత్తులో జరిగే కష్టసుఖముల గురించి తెలుపు శాస్త్రములే, జ్యోతిష శాస్త్రం. 9.గ్రహాలు, 15. తిథులు, 27. నక్షత్రములు, 12. రాశులయొక్క గణితం పై ఆధారపడి ఉన్న శాస్త్రం. హస్త సాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉన్న రేఖలను బట్టి చెప్పు ఈ శాస్త్రమును హస్తసాముద్రిక శాస్త్రం అంటున్నాము. సంఖ్యా శాస్త్రము తొమ్మిది సంఖ్యల పై ఆధారపడి చెప్పు ఈ శాస్త్రమును సంఖ్యాశాస్త్రము అంటు న్నాము. పుట్టుమచ్చల శాస్త్రంలో మనిషి శరీరం పై ఉండే నల్లని మచ్చల ఆధారంగా చెప్పు ఈ శాస్త్రాన్ని పుట్టుమచ్చల శాస్త్రం అంటున్నాము. ఇంకాకొన్ని పద్ధతులలో కూడా కొందరు భవిష్యత్తు చెప్పుతుంటారు. అయితే శాస్త్రం ఉంది అని కొందరు, భగవంతుడు ఉన్నాడని కొందరు, లేడు అని కొందరు వాదిస్తుంటారు. అయితే తెలుసుకోవటం వల్ల తప్పు లేదు కాబట్టి, తెలుసుకోవడం వల్ల లాభం ఉంటుంది కాబట్టి, మన ప్రయత్నములలో సమస్యలను సరిదిద్దుకోవచ్చును. కాబట్టి తెలుసుకోవటం మంచిది. ఈ శాస్త్రం నలుగురికి మంచిచేయాలన్న ప్రయత్నమే ఈ రచనకు కారణం. చదివి తెలుసుకోండి!