
HASTHASAMUDRIKA SASTRAM
₹325
In stock · 4 available
PublisherDR.M.V.RAMANA
LanguageTelugu
1. హస్తసాముద్రిక శాస్త్రం - పరిచయం, పరిణామ వికాసాలు 1.1 పరిచయం : రత్నగర్భయైన భారతదేశం సకల విద్యలకు, సకల శాస్త్రాలకు పుట్టినిల్లు. ఈ దేశంలో పుట్టిన ప్రతీ శాస్త్రం ప్రపంచానికంతటికీ వ్యాపించి నేటి శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలన్నింటికీ ఆధారమైంది. ఈ విధంగానే హస్తసాముద్రిక శాస్త్రం కూడా భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాలకు వ్యాపించి విస్తరించింది. మానవ జీవితం ఆరంభం మొదలు తుదివరకు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో, ఈ ప్రస్తానంలో ఆయా అవస్థలను మహర్షులు సులభంగా బోధపడేటట్టు వివిధ శాస్త్రాలలో బోధించారు. "వైదాహి యజ్ఞార్ధ మభిప్రవృత్తాః కాలాను పూర్వ విహితాశ్చయజ్ఞాః తస్మాదిదం కాల విధాన శాస్త్రం యో జ్యోతిషం వేద సవేద యజ్ఞాన్||” 1 జ్యోతిష శాస్త్రం వేదాంగాలలో ఒకటై భాసిల్లింది. వేదపురుషుని నేత్రంగా జ్యోతిషశాస్త్రాన్ని వైదికులు వర్ణిస్తారు. భారతీయ సంస్కృతికి దర్పణం జ్యోతిషశాస్త్రం. ఇది జన విజ్ఞాన తృష్ణను తీరుస్తున్న జీవనది. జన స్రవంతిపై ప్రవహిస్తున్న సాగరం. దీని ఆద్యంతాలు నిర్ణయించడం కష్టం. ఈ శాస్త్రం అంతా గ్రహచలనం మీదనే ఆధారపడి ఉంటుంది. మానవుడు చేసే ప్రతి క్రియకు శుభాశుభసమయం తెలుపుతూ ఇది సహాయకారిగా నిలుస్తుంది. కాలనిర్ణయం చేయటానికి అతీతాలుగా ఉన్న వేదాలలోనే ఈ జ్యోతిషశాస్త్ర ప్రసంగం ఉండటం వల్ల ఇది ఏనాడు ఆరంభమైనదో చెప్పటం కష్టం. దీని మూల స్థాపకులు మహర్షులని ప్రాచీన విద్వాంసులు నిర్ణయించారు. జ్యోతిషం మూడు భాగాలు. అవి సంహిత, గణిత, జాతకఫలభాగం. సంహిత భాగం నవగ్రహాల స్వరూప స్వభావాల్ని ప్రతిపాదిస్తుంది. గణిత గం పంచాగ గణనానికి అవసరమగు అంశాల్ని వివరిస్తుంది. జాతక భాగం ఫలితాన్ని ప్రకటిస్తుంది. భూమండలంపై గల చరాచర సృష్టికి రవ్యాది గ్రహాల కిరణాలతో ఎంతో సంబంధమున్నట్టు మన పూర్వీకులైన భృగు, వ్యాస, పరాశర, వరాహమిహిరుడు, బృహస్పతి, బడు, గర్గుడు, ఛాగలేయ, గౌతమ, అత్రి, కాశ్యప, వాల్మీకి, ఆర్యభట్ట మొదలగువారు వారి స్వానుభవాలతో దేశకాల సాంప్రదాయాల ననుసరించి జ్యోతిష గ్రంథాలను రచించారు.