HASYA PRAPANCHAM by MACHARLA RADHA KRISHNA MURTHY Telugu book cover

HASYA PRAPANCHAM

by MACHARLA RADHA KRISHNA MURTHY

₹200
In stock · 4 available
PublisherMACHARLA RADHA KRISHNA MURTHY
LanguageTelugu
మనలో మాట "మన పక్క గదిలో ఉన్న పాతికమంది ఆడవాళ్ళను ఓ పది నిమిషాలవరకు ఎవ్వరూ మాట్లాడకుండా చెయ్యగలవా?" సవాల్ విసిరాడు కిరణ్. "ఓ... అదెంతపని" హమీ ఇచ్చాడు చరణ్. "అదెలా?" ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్. “చూస్తుండు” అంటూ ఆ గదిలోకి వెళ్ళి "మీలో కాస్త పెద్ద వయసుగలవారు ఓ పది నిమిషాలు మాట్లాడండి" అన్నాడు చరణ్. అంతే! ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది. కాంబాబు: రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారంటున్నావ్. అయినా నీకు కరాటేలో బ్లాక్ బెల్టు ఉంది కదా! వాళ్ళను చితకబాదకపోయావా? శ్యామ్ : నేను గదిలోకెళ్ళి కరాటే డ్రస్సు వేసుకొని బెల్టు తగిలించుకొని వచ్చేసరికి పారిపోయారు పిరికిపందలు. Θ హాస్యం ఒక ఆప్తమిత్రుని వంటిది. అది మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఆనందపరవశుల్ని చేస్తుంది. అది మన పరిచయాలను పెంచుతుంది. వీటన్నింటికీ మించి ఉత్సాహంగా, ఆనందంగా జీవించడానికి అవసరమైన పరిసరాలను సృష్టిస్తుంది. వాతావరణ కాలుష్యం గురించి నిరంతరం ఆందోళన చెందుతున్న నేటి తరానికి హాస్యం సాయంతో పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చు. మరొక విశేషం. హాస్యం గొప్ప ఔషధిలా పనిచేస్తుంది. అదొక ఆరోగ్యదాయిని, ఆనందదాయిని. "నవ్వు; ఆరోగ్యంగా "ఉండు" అన్న సామెత సారాంశం ఇదే. అందుకే నవ్వులేని జీవి తం దుర్భర దారిద్య్రంతో సమానం అవుతుంది. మనిషిలో నవ్వు ఉద్వేగాన్ని తగ్గిస్తుం దని ఫ్రాయిడ్ ఉద్ఘాటించాడు. ఆవిధంగా అన్ని రచనలకు, ఉపన్యాసాలకు, కార్టూన్లకు, ఆనందానికి.... జీవంలా హాస్యం ఎరిగింది. ఎందరో మేధావులు ప్రపంచవ్యాప్తంగా హాస్యంపై పరిశోధనలు చేసి పిహెచ్. ఓలు, ఎం.ఫిల్.లు పొందడం హాస్య ప్రాధాన్యాన్ని తెలపడానికి మరొక ఉదాహరణ. ఆనందానికి సూచిక, ఆహ్లాదానికి సంకేతం నవ్వు. "నవ్వు నాలుగు విధాల వేటు" అన్నారు ఆనాడు. "నవ్వు నాలుగు విధాల గ్రేటు” అన్నారు నిన్నటిదాకా.