
HEART ATTACK
₹40
In stock · 29 available
PublisherDR.GUMMANURU RAMESH BABU
LanguageTelugu
రచయిత ముందుమాట హార్ట్ టాక్ వచ్చిందని వింటేనే చాలు చాలా మంది భయపడిపోతారు. వారు భయపడడమే కాదు అందరినీ భయపెడతారు. హార్ట్ ఎటాక్ వచ్చినవాడిని హరీమనిపిస్తారు కూడా. ఇదంతా చూచినవారికి, విన్నవారికి నిజానిజాలు తెలియకపోతే అయోమయంలో పడిపోతారు. అపోహలు, అనుమానాలు ఎక్కువై అసలు వ్యాధి కన్నా భయం ఎక్కువై నిండు నూరేళ్ళ జీవితాలను చేజేతులా పాడు చేసుకుంటారు. అందుకే ఇటువంటి అపోహలను, అనుమానాలను నివృత్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది. 2001వ సంవత్సరం నుంచి సెప్టెంబర్ 30 వ తేదీని అంతర్జాతీయ హృదయదినోత్సవంగా గుర్తించడం కూడా ఈ లక్ష్యసిద్ధికోసమే! బి.పి వస్తే సరి జీవితం అయిపోయిందని అనుకుంటారు కొంతమంది. ఘగర్ కూడా వస్తే పూర్తిగా జీవితం అయిపోయిందని బెంగపడిపోతారు. లేనిపోనివి ఊహించుకుని అర్ధంపర్ధం లేని అలోచలను అదేపనిగా చేసి పక్షవాతం, న్యూరోసిస్, అమ్నీసియా వంటి వ్యాధులను కొని తెచ్చుకుంటారు. ముందు ఫోబియా ఉంటుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్ ఏమాత్రం ఉందని డాక్టర్లు అన్నా యిక హార్ట్ ఎటాక్ వస్తుందనుకుని వచ్చినంత పనిచేస్తారు. వస్తే తలలు వాల్చేస్తారు. అందుకనే హార్ట్ ఎటాక్ గురించి ఉన్న ఫోబియాను ముందు తొలగించాలి. దానికోసమే ఈ పుస్తకాన్ని వెలువరించడం జరుగుతోంది. హార్ట్ గురించి, హార్ట్ ఎటాక్ గురించి అన్ని విషయాలను వివరంగా, విపులంగా, సున్నితంగా, సూటిగా చెప్పడం జరిగింది. ఏ చిన్న విషయాన్నీ వదలిపెట్టలేదు. సాధ్యమైన మేరకు తాజా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయబడింది. సాంకేతిక పదాలు అర్థమయ్యేలా పుస్తకం చివరన పారిభాషిక పదకోశం యివ్వబడింది. ఎవరి సహాయము లేకుండానే కాస్తోకూస్తో అక్షరజ్ఞానం ఉన్నవారు చదివి అర్ధంచేసుకునేలా సాధ్యమైనంతవరకు అతి తేలికగా వ్రాయడం జరిగింది. ఒక పాప్యులర్ సైన్స్ రచయితగా, జీవశాస్త్ర నిపుణుడిగా నాకున్న అనుభవాన్ని జోడించి మిత్రులు, సహృదయులు అయిన కొంతమంది వైద్యుల అభిప్రాయాలను కలగలపి ప్రామాణికమైన రెఫెరెన్స్ పుస్తకాలను, మెడికల్ బులెటిన్లను, ఇంగ్లీష్ తెలుగు దినపత్రికలలో వచ్చేవ్యాసాలను, వార్తలను పరిశీలించి అందరూ చదువుకుని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి వీలుగా ఈ హార్ట్ ఎటాక్ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దీనిని అతి విలువైన, ఎంతో అరుదైన పుస్తకంగా తీర్చిదిద్దాను. ఇటువంటి పుస్తకాన్ని ప్రచురించడానికి పూనుకున్న భగీరథ పబ్లికేషన్స్ అధినేత శ్రీ పర్వతరెడ్డి బాలకృష్ణా రెడ్డి గారికి అభినందనలు తెలియచేస్తున్నాను.