HEIGH SCHOOL INTERMEDIATE BOUTHIKA SASTRAM - VOL 2 by DULLA MURALI NARAYANA Telugu book cover

HEIGH SCHOOL INTERMEDIATE BOUTHIKA SASTRAM - VOL 2

by DULLA MURALI NARAYANA

₹70
In stock · 41 available
PublisherDULLA MURALI NARAYANA
LanguageTelugu
హైస్కూలు-ఇంటర్మీడియేట్ భౌతికశాస్త్రం ఈ సీరియల్ రెండవ వాల్యూమ్ ప్రాక్టికల్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ, చిత్రాల ద్వారా సర్క్యూట్ ఏర్పాట్లు చూపిస్తూ, రచన కొనసాగుతుంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులలో కాంపొనెంట్లు తగరపు టంకంతో అంటిస్తూ సర్క్యూట్లు నిర్మించడం శ్రేష్ఠం. విద్యార్థులు ఈ పనికి టైమ్ కేటాయించలేకపోతే, బ్రెడ్బోర్డ్ చిల్లులలో కాంపొనెంట్లు గుచ్చుతూ సర్క్యూట్లు నిర్మించి, పవర్ సరఫరా చేసి సర్క్యూట్ ఉద్దేశ ఫలితాలు పొందవచ్చు. ఈ రచనలో అన్ని సర్క్యూట్లు బ్రెడ్ బోర్డు ద్వారానే సూచింపబడుతాయి. ఈ ఎక్స్పరిమెంటల్ విద్యుత్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించే పూర్వం, సర్క్యూట్ల నిర్మాణంలో వాడే తీగల గురించి కొంత అధ్యయనం చేయవలసి ఉంది. సర్క్యూట్లలో తీగలు ద్వారా కనెక్షన్లు చేస్తాము. వీటికి ఆదర్శంగా ఎటువంటి నిరోధం ఉండకూడదు. నిరోధంలేని పదార్థాలంటూ ఉండవు. ప్రతి పదార్ధంకి ఏదో కొంత నిరోధం అంటూ ఉంటుంది. అన్నిట్లోకి అతి తక్కువ నిరోధం వెండికి ఉంటుంది. ఆ తర్వాత ఉత్తమమైనది రాగి, అంతకంటే కొంచెం ఎక్కువ నిరోధం అల్యూమినియమ్కి ఉంటుంది. వెండి ప్రియమైనది కాబట్టి, రాగిగాని, అల్యూమినియమ్ గానీ, విద్యుత్, ఎలక్ట్రానిక్స్ ప్రయోగాలలో కాంపొనెంట్సు కలిపే తీగల లాగా వాడవచ్చు. లాబరేటరీలలో కాపర్ తీగలు వాడవచ్చు. విద్యుత్ సరఫరాకి అల్యూమినియమ్