HELEN KELLER JEEVITHA GATHA - 40 by DR.NANNAPANENI MANGADEVI Telugu book cover

HELEN KELLER JEEVITHA GATHA - 40

by DR.NANNAPANENI MANGADEVI

₹40
In stock · 634 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
హెలెన్ కెల్లర్ జీవిత గాథ “మా కివ్వాళ కొత్త సంగీతం మాస్టారొచ్చారు" హడావుడిగా కాళ్లూ చేతులూ కడుక్కొచ్చి కంచం ముందు కూర్చుంటూ అంది సుజాత. తలైనా ఎత్తకుండానే కిరణ్ ఊకొట్టాడు- ఇందులో విశేషమేముంది. అన్నట్లు. అన్న దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో తమ్ముడి వేపు చూసింది సుజాత. సుజాతకు తనకు వయసులో అట్టే తేడా లేకపోవడంతో తనకంటే పెద్దదైనా అక్కనస్సలు లెక్కచేయడు మధు. అస్తమానం అక్క నుడికించడం వాడికి హాబీ! "మీ కొత్త సంగీతం మాస్టారిలో విశేషమేమిటట? ఆయన అందరిలాగ ఉండరా?" ఎకసెక్కెంగా కళ్ళెగరేశాడు. సుజాత ఇప్పుడెవరేమన్నా ఉడుక్కునే స్థితిలో లేదు. ఎలాగైనా సంభాషణ పొడిగించి క్రొత్త మాస్టారి ప్రత్యేకతేమిటో చెప్పాలనుంది. "అవునురా! ఆయన అందరిలాగ లేరు". సుజాత మాట ముగించే లోపలే అందుకున్నాడు మధు. "ఏం? ఆయనకు నెత్తిమీద కొమ్ములున్నాయేమిటి?” చారుగిన్నె పట్టుకొచ్చిన తల్లి కోపగించుకుంది. "బొత్తిగా చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడ్డం నేర్చుకున్నావ్! టీచర్లంటే గౌరవం లేకపోతే వాళ్లు చెప్పే చదువు మాత్రం ఏం వంటబట్టి ఏడుస్తుంది?" రోజూ భోజనాల దగ్గర స్కూలు గురించి, టీచర్ల గురించి జరిగే వాదనంతా వింటున్న రాజ్యలక్ష్మికి పిల్లలు రోజురోజుకూ బొత్తిగా అదుపూ ఆజ్ఞా లేకుండా పోతున్నారనిపించింది. తల్లి అదిలింపుతో సుజాతకు మాట్లాడ్డానికి ఛాన్సు దొరికింది. “మా కొత్త మాస్టారికి కళ్లు లేవు" సుజాత గొంతులో మాస్టారికి కళ్లులేవన్న బాధ కంటే నేను చెప్పేది విశేషమే కదా అన్న సంతృప్తి ధ్వనించింది. "కళ్లున్న మాస్టర్లనే మీ కోతిమూక ముప్పతిప్పలు పెడుతుంటారు. చూపే లేకపోతే ఆయన్ని మీరసలు బ్రతకనిస్తారటే" ఆశ్చర్యంగా అంది తల్లి.