HEMANTHA GEETAM by PUPPALA SURYA KUMARI Telugu book cover

HEMANTHA GEETAM

by PUPPALA SURYA KUMARI

₹35
In stock · 1 available
PublisherPUPPALA SURYA KUMARI
LanguageTelugu
ముందుమాట గ్రీష్మంలో విడుదలవుతున్న హేమంత గీతాలకు స్వాగతం. వేడి వడగొట్టే కాలంలో హిమ వర్షం కురిపించే పాటల సంపుటి చల్లగాలిలా తాకి పరవశింపజెయ్యడం ఆహ్వానించదగిన పరిణామమే. హిమాగమంలాంటి ఈ పాటలు హిమాలయం మనుమడైన హేరంబుని స్తుతితో ప్రారంభం కావడం లాభం, క్షేమం. పుప్పాల సూర్యకుమారిగారు వచన కవితలు రాయడం మాకందరికీ తెలుసు. ఇప్పుడీ 'పాటలీ' పుత్రాన్ని తమ కవితా రాజధానిగా చేసుకోవడం క్రొత్త దండయాత్రే. అయితే ఇది పూలదండయాత్రే. పాటలో పువ్వుల్లాంటి పదాలే ఇముడుతాయి. అన్నీ ఇమడవు. ఆ పువ్వుల్ని ఎంపిక చేసుకోవడంలో స్త్రీ అయిన పుప్పా (ష్పా) ల సూర్యకుమారి గారు అత్తవారింటిని సుగంధ మధురం చేశారు. లేకపోతే "వరమాలిక, దరహాసం, దేవేరి, సిరులొలికే, రవళించే" లాంటి సున్నితమైన పదాలు ఈ పాటల్లో తరచు కనిపించేవి కావు. "కవన వీణ" అనే పాటలో లక్ష్మీదేవి నవ్వుని "నగవుల కెంపులు" అని పోల్చారు. సాధారణంగా నవ్వులను తెల్లని వస్తువులతో పోలుస్తారు. ఇక్కడ ఆ శ్రీదేవి అధర కాంతితో కలిసి కాబోలు నవ్వులు కెంపులయ్యాయి. మనోహరమైన ఊహ. అయినా డబ్బున్న వాళ్ళ నవ్వులు గదా! కాస్త రంగులు మారిస్తేనే బాగుంటుంది. ఎన్నో పాటల్లో అతి నూతన పదప్రయోగాలున్నాయి. 'తేనీయ బాసలతో గుసగుసలాడటం' వాటిలో ఒకటి (వెన్నెల కన్నె). ఇలా ఎన్నో మాధుర్యాలు, సౌందర్యాలు ... అన్నీ పీఠికలో చెప్పకూడదుగదా! చదవండి మీ హృదయ పీఠికలో దాచుకోండి.