
HETHUVADAM
₹200
In stock · 12 available
PublisherJ.V.KRISHNAIAH
LanguageTelugu
హేతువాదం - వ్యక్తిగత అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందా? "మానవుడు స్వతహాగా హేతువాది.” “హేతువాద"మంటే ఏమిటో తెలుసుకుందాం. హేతువు అంటే కారణభూతమైన, రుజువుతో కూడిన, ఆధారంతో కూడినదని అర్థం. వాదం అంటే వాదించుట లేక చర్చించుట లేక అభిప్రాయ ప్రకటన అని అర్థం. కనుక హేతువాదమంటే హేతువుతో కూడిన, కారణభూతమైన, రుజువుతో కూడిన, ఆధారముతో కూడిన వాదాన్నే “హేతువాదం” అంటారు. ఆధారసహితంగా ఆలోచించేవారిని, కామన్ సెన్స్తో ఆలోచించే వారిని, ఇంగితజ్ఞానంతో ఆలోచించే వారిని, స్వతంత్ర ఆలోచనావిధానం కలిగిన వారిని, హేతువుతో కూడిన ఆలోచన కలిగిన వారిని "హేతువాది” అంటారు. హేతువాదంమంటే ఒక “శాస్త్రీయ ఆలోచనా విధానం.” సక్రమమైన మానసిక వైఖరి.” హేతువాదాన్ని 'కార్యాకారణ సంబంధం' అని కూడా అంటారు. కార్యాకారణాల సంబంధాన్ని అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే పద్ధతినే "హేతువాదం" అంటారు. “హేతువాదమంటే సైన్సు". హేతువాదం, సైన్సు ఒకేసారూప్యత కలిగి ఉంటాయి. ఏ విషయమైన, ఏ సంఘటన అయినా ప్రయోగ పూర్వకంగా రుజువు అయితే తప్ప సైన్సు, హేతువాదం ఒప్పుకోవు.' "ఏ వ్యక్తిని గాని, ఏ గ్రంథాన్ని గాని హేతువాదం ప్రామాణికంగా అంగీకరించదు. ఆధారసహితంగా రుజువు అయితే తప్ప.” "హేతుబద్దంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధానమునే “హేతువాదం" అంటారు. "నిత్యం అభివృద్ధి చెందే విజ్ఞానానికి వాస్తవిక మదింపు వేసే పద్ధతిని "హేతువాద"మంటారు. “హేతువాదమంటే" స్వతంత్ర ఆలోచనా విధానం (ప్రీథింకర్)