HINDI KAVULU SAHITHEEVETTALU by DAPPURI SRIDHARACHARYULU Telugu book cover

HINDI KAVULU SAHITHEEVETTALU

by DAPPURI SRIDHARACHARYULU

₹60
In stock · 1 available
PublisherSPRUHA SAHITHEE SAMSTA
LanguageTelugu
చందవరదాయి 1148-1192 ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దేశీయ భాషల్లో హిందీ భాష ఒకటి. దీనిపైన ప్రాచీన సంస్కృత, ప్రాకృత, పాళీ భాషల ప్రభావం ఉంది. హిందీ భాష పుట్టుకకు సంబంధించిన ఆధారాలు ఏడవ శతాబ్దం నుంచి ఉన్నాయని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం, కానీ హిందీ భాషలో మొదటి కావ్యం పృధ్వీరాజరసో. దీన్ని రచించిన చంద వరదాయి తొలికవిగా గుర్తింపుపొందాడు. చందవరదాయి క్రీ.శ. 1148లో జన్మించి 1192లో మరణించినట్లు తెలుస్తోంది. ఈయన జన్మించింది లాహోర్లో. తండ్రిపేరు రావ్వేణా. అజ్మీరును పాలించిన చౌహాన్ రాజుల కులపురోహితుడు. చందవరదాయి చిన్నప్పటి నుంచి కుశాగ్రబుద్ధిగలవాడు. చిన్నవయసులోనే భాషా, సాహిత్యం, వ్యాకరణం, అధ్యయనం చేశాడు. పురాణాల్ని, జోతిశాస్త్రాన్ని ఔపోసన పట్టాడు. ఈతని మేధోసంపత్తికి మురిసిన ఢిల్లీ పాలకుడు పృధ్వీరాజ్ చౌహాన్ తన ఆస్థానకవిగా నియమించుకోవడమేగాక, అతన్ని తన అంతరంగిక మిత్రుడిగా చేసుకున్నాడు. చందవరదాయి కవి మాత్రమే కాదు, గొప్ప యుద్ధవీరుడు కూడా. పృధ్వీరాజ్ పాల్గొన్న యుద్ధాల్లో అతని వెంట ఉండి తన యుద్ధ కౌశలాన్ని అనేకమార్లు ప్రదర్శించాడు.