
HINDU DHARMAM PRAVESIKA
by DR.SUDANAGUNTA RAGHAVENDRA PRASAD
₹300
In stock · 3 available
PublisherKALYANI RAGHAVAM PUBLICATIONS
LanguageHindi
1. సనాతన ధర్మం హైందవధర్మం అసలు పేరు సనాతనధర్మం. సనాతనమంటే ఎంతో ప్రాచీనమని అర్థం. ధర్మం అంటే సత్ప్రవర్తన అని భావం. కాబట్టి సనాతనధర్మమంటే అనాదికాలం నుండీ ఆచరింపబడుతూ వస్తూన్న సత్ప్రవర్తన మని సారాంశం. కాబట్టి హైందవధర్మమంటే మరేదోకాదు- సత్ప్రవర్తనతో కూడిన జీవన మనేదే దాని అర్థమన్నమాట. సనాతనమనే పదానికి ఇంత అనే కాలపరిమితి లేకుండా సర్వకాలాలకీ గొప్పదనేది కూడ అర్థం. ధర్మమనే పదానికి 'ఋతం' అనే అర్థం కూడా ఉంది. ఋతం అంటే ప్రకృతి స్వభావం / సృష్టి. అలా పునరావృతమౌతూ అనాదికాలం నుండీ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రమమే సనాతనధర్మం.