HINDU MATHAM - OKA SANATHANA DHARMAM by MANGA RAMAKRISHNA Telugu book cover

HINDU MATHAM - OKA SANATHANA DHARMAM

by MANGA RAMAKRISHNA

₹48
In stock · 16 available
PublisherJYOTI BOOK DEPOT
LanguageTelugu
ISBN9788191036794
నా మాట ప్రపంచీకరణ, సరళీకరణ ఆవశ్యకతతో భారతదేశ యువత యొక్క జీవనవిధానంలో పెనుమార్పులు సంభవిస్తున్న తరుణంలో, ఆధ్యాత్మిక చింతనకు, సాంప్రదాయ విలువలకు మిగిలినచోటు అతిస్వల్పము. అయినప్పటికి, భారతీయ వైదికసంస్కృతి, హిందూమతవిలువలను ఆచరించి, కాపాడి, ముందుతరాలకు తోడ్కొనిపోవలసిన గురుతర బాధ్యత మన యువతీ, యువకులదే. అదే సమయంలో పెద్ద గ్రంధాలు, సంక్లిష్టశాస్త్రాలు చదివి, ఆకళింపుచేసుకొనే సమయం, అవకాశం వారికి లేదుకావున, శులభశైలిలో వీలైనంత ఎక్కువ విషయాన్ని తక్కువ పరిధిలో తెలియచేయాలనే సద అభిప్రాయం "హిందూమతం ఒక సనాతన ధర్మం" అను ఈ గ్రంధము యొక్క లక్ష్యం. ఈ గ్రంధాన్ని శ్రీలలితామహాత్రిపురసుందరి, శ్రీకృష్ణపరమాత్మ పవిత్ర పాదపద్మముల చెంత మిక్కిలి భక్తితో సమర్పించుకొనుచున్న పరిమళభరిత చిన్ని పుష్పము. నా ఈ చిరుప్రయత్నాన్ని పెద్దలు, పండితులు, సహృదయముతో ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ గ్రంధ రచనలో అవసరమైన మేరకు సలహాలు, సూచనలు అందించిన గురుతుల్యులు శ్రీరాంభట్ల వేంకట సోమయాజులు గారికి నా కృతజ్ఞతలు. మరియు చిత్తుప్రతుల నుండి శుద్ధప్రతులను తయారుచేయుటకు సహకరించిన సహాధ్యాయినులు శ్రీమతి పొన్నెకంటి శ్రీవిద్య, కుమారి ఆదిరెడ్డి సత్యవతి గార్లకు నా ఆశీస్సులు.