
HINDUTVA SIMHASANAMPAI ABADDAALA CHAKRAVARTHI
₹75
In stock · 137 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126894
ప్రపంచ దేశాలలో భారత్ ఏఏ విషయాలలో ఏ స్థాయిలో ఉందో ఆ ర్యాంకింగ్ చూసి అర్థం చేసుకోవచ్చు. గత పదకొండేళ్ళలో ప్రస్తుత ప్రభుత్వం దేశాన్ని ఎంతగా దిగజార్చిందో తెలుసుకోవడానికి ఈ పుస్తకం - ఒక సూచిక! అమ్ముడుపోయిన ప్రధాన మీడియాలో ఇలాంటి విషయాలు చర్చకు రావు. అదొక బహిరంగ రహస్యం! గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో భారతే 107వ స్థానం. పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 126వ స్థానమైతే, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో 124వ స్థానం. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 135వ స్థానం. జెండర్ ఈక్వాలిటీ (లింగ సమానత్వం)లో 122వ స్థానం. ప్రపంచ కాలుష్య దేశాలలో భారత్ 5వది. ఇంటర్నెట్ అందుబాటులో ఉంచే విషయంలో 78వది. అవినీతిలో 85వది. ఇలా ఏ విషయం తీసుకున్నా తలదించుకోవాల్సిన పరిస్థితే! దేశ ప్రధాని విదేశాలలో విస్తృతంగా పర్యటించేది కార్పొరేట్ల మేలు కోసమే. అమెరికా- భారతీయ యువకులకు బేడీలు వేసి దొంగల్లా తిప్పిపంపినా, మోడి ప్రభుత్వం కిమ్మనలేదు. టాక్స్ టారీఫ్లు ఎంతగా పెంచినా నోరు మెదపలేదు. పాక్పై యుద్ధం ఆపేయమనగానే ఆపేసింది. ఇలా మోడి ప్రభుత్వం- అమెరికాకు చేస్తున్న 'గులాంగిరి'ని దేశ ప్రజలు సహించలేకపోతున్నారు. నేటి దేశ కాల పరిస్థితుల్ని దృష్టిలో వుంచుకుని- ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారు చేసిన ఈ విశ్లేషణలు జన చైతన్యానికి తప్పక దోహదం చేస్తాయి! జననాడిని, జీవనాడిని పట్టుకోవడంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఎప్పుడూ ముందే ఉంటూ వస్తోంది గనుక, హిందుత్వ సింహాసనంపై అబద్ధాల చక్రవర్తి శీర్షికన ఈ పుస్తకాన్ని పాఠకులకు సగర్వంగా అందిస్తూ వుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN:978-93-48126-89-4