
HIRANYAGARBHA NATAKAM
₹30
In stock · 176 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ నాటక నేపథ్యం గురించి "History always repeats itself' అనేది ఈ నాటకానికి మూలం. పేర్లు, రూపాలు మారినా తరతరాలుగా జరుగుతున్నది ఒకటే కథ. ఏ సాంప్రదాయమూ సమాజానికి కీడు చెయ్యాలని సృష్టించబడదు. ఏ సాంప్రదాయమూ ఎల్లప్పుడూ మేలు చేయదు. అలాగే ఏ సాంప్రదాయమూ తన ప్రయోజనం తీరిన వెంటనే సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదు. ఎందుకంటే దానివలన లాభం పొందుతున్న వాళ్ళు అది ఉండాలని కోరుకుంటారు. నష్టపోతున్న వాళ్ళు దాన్ని తరిమేయాలని ప్రయత్నిస్తారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. మనదేశ చరిత్రలో ఏం జరిగిందో చరిత్రకారులు సాక్ష్యాధారాలతో చెప్పారు. అలాంటి చరిత్రకు సమాంతరంగా ఓ కాల్పనిక నేపథ్యాన్ని సృష్టించుకుని ఈ నాటకం రాశాను. భారతదేశం నా నాటకంలో ఇంద్రద్వీపం. ఓ పెద్ద ఉప్పెనొచ్చి అంతా న నాగరికత మొత్తం నాశనమైపోయింది. ఏవీ ఏవీ మిగల్లేదు. కొట్టుకుపోయింది. కొంతమంది మాత్రం బతికి బట్టకట్ట గలిగేరు. అప్పటికున్న మేధస్సు తప్పా వస్తుపరంగా అనాగరికుల్లా మిగిలేరు. ఎక్కడ చూసినా ఇసుకమేటలే, ఉప్పు నీళ్ళే. ఉండడానికి, తిండానికీ ఏవీ లేదు. చుట్టూ శవాలు. ఏ శవం ఎవరిదో తెలీదు. ఏడవడం తప్పా ఏవీ చెయ్యలేని స్థితి అది. ఏడ్చారు. బతికినందుకు ఏడ్చారు. ఇంకా బతకాలి గనుక ఏడ్చారు. చచ్చినవాళ్ళే అదృష్టవంతులనుకుని కుమిలి, కుమిలి ఏడ్చారు. మతం మరుగున పడిపోయింది. అలా ఏడుస్తూ, ఏడుస్తూ ఒకర్నొకరు ఓదార్చుకున్నారు. అంతకుముందు వాళ్ళ మధ్యనున్న కులాల గురించి మర్చిపోయారు. వర్గాల్లేవు. విభేదాల్లేవు. అంతా ఒక్కటయ్యారు. ద్వీపాన్ని పునర్నిర్మించుకుంటూ ముందుకెళ్ళారు. ఇలా ఈ పునర్నిర్మాణంలో మాస్ట్రో వారికి మార్గదర్శకులయ్యారు. దారీ తెన్నూ చూపించారు. దిశానిర్దేశం చేసారు. కొత్త సూత్రాలు, నీతులు ప్రవేశపెట్టారు. అందరూ వాటిని అవలంబించారు. ఆచరించారు. అతన్నే దైవంగా ఆరాధించారు. యాభైయ్యేళ్ళు గడిచాయి. ఈ యాభైఏళ్ళ కాలగమనంలో అనేకమైన క్రొత్త క్రొత్త వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. ప్రజలు కూడా క్రొత్త క్రొత్త అవస్థల పాలయ్యారు. అలాంటి వాళ్ళు వ్యవస్థను ప్రశ్నించడం మొదలు పెట్టారు. చరిత్ర : పూర్వం దేశంలో గణాలుండేవి. గణ వ్యవస్థలో పశువులు ప్రధాన సంపద. ఆర్యులు తమ తెగలను గోత్రాలుగా పిలిచేవారు. గోత్రం తన పశుసంపదను ఉమ్మడిగా కలిగి ఉండడం చేత ఆ సంపదను రక్షించే 'పశువుల పాకను' గోత్రం అనేవారు. ఈ తెగల్లో ఇంకా చిన్న చిన్న బృందాల్ని గ్రామాలుగా పిల్చేవారు. ఈ గ్రామాల మధ్య జరిగే సంఘర్షణల్ని సంగ్రామాలుగా చెప్పుకున్నారు. వ్యవసాయం ముఖ్యవృత్తి అయిన తర్వాత స్థిరనివాసం అబ్బింది. ఆ ఆవాసాలే గ్రామాలుగా మారాయి. ఆర్యగణాల్లో క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య అనే మూడు వర్గాలు