
HOLLYWOOD MOVIE A QUICK RENTAL GUIDE
₹100
In stock · 20 available
PublisherDR.G.SURESH BABU
LanguageTelugu
క్రైసిస్ మేనేజ్మెంట్ పది నిమిషాలు ఆలస్యమవ్వడంతో విమానాశ్రయంలో నన్ను చెకిన్ అవ్వనివ్వలేదా ఆడ డ్యూటీ మేనేజర్. ఇరవై ఐదేళ్ళ మిస మిసలాడే యవ్వనం - మిస్ స్వప్న బర్ధన్ ని స్వప్న సుందరిలా ఆవిష్కరిస్తుండటం నేనో పక్క ఎంజాయ్ చేస్తూనే మరో పక్క ముంబాయ్ విమానం మిస్సయ్యి టిక్కెట్ క్యాన్సిలై వెయ్యి రూపాయల నష్టం వాటిల్లినందుకు విచారిస్తూ... ఆవిడని మరోసారి అర్థించాను - ఎలాగైనా మధ్యాహ్నం వరకి నేను ముంబాయిలో వుండి తీరాలని! ఆమె నిర్థాక్షిణ్యంగా తిరస్కరించి- ఫ్లయిట్ చార్ట్ని టెర్మినల్ వద్ద సబ్మిట్ చెయ్యడాన్కి కలహంసలాగా కదిలి వెళ్తాంది. ముంబయి సిద్ది వినాయక టెంపుల్ లో వరమాలతో నా కోసం ఎదురు చూస్తోన్న నా ప్రేయసి లక్ష్మిని - ఈసారి కూడా చేరుకోలేకపోయానో,... ఇంక తను నన్ను ఈ జన్మకి క్షమించజాలదు! మరో గంటలో ఇంకో ఫ్లయిట్ వుంది కానీ, ఇప్పటికిప్పుడు టిక్కెటు ధరను మూడింతలు కట్టి అమ్ముతున్నారు! నా దగ్గిర అంత డబ్బు లేదు. అన్ని దార్లూ మూసుకుపోయి నా మైండ్ బ్లాంకయ్యింది. విమానాశ్రయ ప్రకంపనాలకి నా మెదడు ఆలోచించడం మానేసి తలనెప్పి మొదలైంది. కింకర్తవ్యం? ఇదే గనక హాలీవుడ్ సిన్మాలో సన్నివేశం అయ్యుంటే:- అది పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా నా ప్రేమ పెళ్ళిని కాలరాసిన స్వప్నని రివెంజ్ కోసం ఎలాగైనా లైన్లో దింపే ప్రయత్నం చేసుండేవాన్ని. కనీసం డేట్ ఛాన్సైనా దక్కితీరుతుంది. తీరా చూస్తే స్వప్న- లక్ష్మికి గర్ల్ ఫ్రెండ్ అయ్యివుండి - నన్ను కావాలనే ... టైం ముందుకి జరిపి చెక్కిన్ అవ్వకుండా చేసినట్లు క్లైయిమాక్స్లో తేల్తుంది. బాలీవుడ్:- సెక్యూరిటీ కళ్ళు కప్పి ఎలాగోలా రన్నింగ్ ఫ్లయిట్లోకి దూరి, విమానం హైజాక్ చేసి, ఆపైన పారాచట్ తో దూకేసి టయిమ్కి టెంపుల్లో ప్రత్యక్షమవ్వగలిగే వాన్ని. కానీ.... అప్పటికే లక్ష్మిని - వాళ్ళ డాడీ - ముందే మాట్లాడి పెట్టిన అనిల్ కపూర్ తో తాళ్ళి కట్టించుండేసే వాడు! నా ఎడ్వెంచర్ని కళ్ళారా చూసిన స్వప్న, ముంబాయి ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోవడంతో శుభం కార్డు పడేది. టాలీవుడ్ : బతిమాలడాన్కి అమాంతం స్వప్న కాళ్ళు పట్టేసుకుని నా గెడ్డం ఆమె మోకాళ్ళకు రుద్ది పన్లోపనిగా నా కసితీరేలా ఒక ముద్దెట్టుకుని సోలో ట్రాజెడీ సాంగేసుకుంటూ ఇంటిదారి పట్టుండేవాన్ని. ఇంటికెళ్ళి ఫుల్లుగా మందుకొట్టి నిద్దరోయి కళ్ళు తెరిచే సరికి లక్ష్మి నా ఎదురుగా కన్పడేది. ఆశ్చర్యం ! ఫ్లయిట్కు నేను రాకపోయేసరికి లక్ష్మి- ఇంక, శ్రీహరి అన్న సహాయంతో నన్ను వెదుక్కుంటూ హైద్రాబాద్ వచ్చేసింది. వాంప్, వాంపే; ప్రేయసే పెండ్లాం! మర్చిపోకుండా ఇంటర్వెలు ముందేసిన చిక్కుముళ్ళన్నీ లెక్కబెట్టి మరీ విప్పేయాల్సిందే! దటీజ్ ది టాలీవుడ్ సిన్సియారిటీ.