
HOMEO VAIDYA MARGHADARSINI
by VAMSI MANJUNATH PUBLICATION
₹80
In stock · 15 available
PublisherVAMSI MANJUNATH PUBLICATION
LanguageTelugu
ముందుమాట హెూమియో వైద్యం అభిమానులకు శుభాకాంక్షలతో వ్యాధిని శీఘ్రంగానూ, సున్నితం గానూ, శాశ్వతముగానూ నివారించాలనే గొప్ప ఆశయంతో జర్మనీ దేశస్థుడు డా॥శామ్యూల్ క్రిష్టియన్ ఫ్రెడరిక్ హానిమాన్ (10-4-1755-1884) మహత్తర పరిశోధనా ఫలితమే ఈ హోమియో విధానము. గృహస్తులు వ్యాధిని గురించి కొంచెమైనా ప్రధమచికిత్స పరిజ్ఞానము కలిగియుండాలనే ఆశయంతో "హెూమియో వైద్య మార్గదర్శిని" అనే పేరుతో నేను వ్రాసిన చిన్న పుస్తకం ది.10-4-1978 తేదీన అప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు కీ||శే||గౌ॥ శ్రీ పరకాల శేషావతారం గారిచే హనెమాన్ జయంతి సందర్భములో ఆవిష్కరించడం జరిగింది. ది. 13-4-1985 వ తేదిన పశ్చిమ గోదావరి జిల్లా హెూమియో వైద్యుల సంఘం స్వర్ణోత్సవాల సందర్భంలో కీ॥శే॥ శ్రీ S.V.S. జోగయ్య గారిచే ద్వితీయ ముద్రణ విడుదల చేయడం జరిగింది. మూడవ ముద్రణ 1905 వ సంవత్సరంలో జరిగింది. ఇది నాల్గవముద్రణ. తపోభూమి నైమిశారణ్యంలో 2010 ఏప్రియల్ నెలలో పూర్తిచేయబడినది. హెూమియో వైద్యంలో నాకు ప్రేరకులు మా గృహవైద్యులు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కీ॥శే॥ శ్రీ తోలేటి పేర్రాజు గారు. నాచే ది. 5-3-1965 వ తేదిన "ఈశ్వర హెూమియో స్టోర్సు" ను ప్రముఖ న్యాయవాదులు కీ॥శే॥ శ్రీ శ్రీపాద లక్ష్మి నర్శింహం గారి భార్య శ్రీదేవి గారి అమృత హస్తాల మీదుగా ప్రారంభింప చేసిన ప్రియ మితృలు, ప్రముఖ వైద్యులు డా||శ్రీ శిరిగినీడి నాగభూషణం గారు, ప్రియమితృలు కీ॥శే॥ శ్రీ చినమిల్లి అప్పారావు గారు, తదాదిగా నాకు సలహా సహకారాలందించిన ప్రియ మితృలు శ్రీ మంచిలి సత్యన్నారాయణ మాష్టారు అభినందనీయులు. ఈ నాల్గవ ముద్రణకు అన్నివిధాల ప్రోత్సాహమిచ్చిన హెూమియోపతి వైద్య అభిమానులకు కృతజ్ఞతాభివందనములు. "హెూమియో వైద్య మార్గదర్శి" రూపకల్పనలో నాకు పరిశీలనలో తోడ్పడినవి, సుమారు ఏభై సంవత్సరాలకు పైగా నాకున్న హెూమియో వైద్యంతో అనుబంధము, డా॥ విల్మర్ స్క్వేబ్ జర్మనీ వారి హెూమియోపతిక్ రిపటోరియం, మరియు మెడికల్ ఎడ్యుకేషన్, డా॥ మాడూస్ జర్మనీ వారి ఓలిగోప్లెక్సు బుక్లెట్సు బొరిక్ అండ్ టాఫెల్ ఫిలడెల్ఫియా (అమెరికా) వారి బుక్లెట్సు డా॥ నెర్ ధీరపుటెక్స్ మరియు జైన్ పబ్లికేషన్సు న్యూఢిల్లి వారి హెరిటేజ్, అప్-డేట్ పత్రికలు, మాతృద్రావకములు, ఎకనమిక్ హెూమియో ఫార్మశి (కొల్కత్తా) వారి బుక్ లెట్సు మరియు యం. భట్టాచార్య హెూమియో ఫార్మశి (కొల్కత్తా) వారి బుక్లెట్సు.