
HOMEOTHO SAMPOORNA AROGYAM
₹60
In stock · 6 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
హోమియోతో సంపూర్ణ ఆరోగ్యం హోమియోపతి సరళ- సహజ వైద్యం హోమియో వైద్యమును మొట్టమొదట జర్మన్ దేశస్థుడైన డాక్టర్ శ్యామ్యుల్ హానిమన్ అనే మహాశయుడు కనుగొనడం జరిగింది. ఈయన 10-04-1775వ సంవత్సరమున జర్మనీ దేశంలోని 'మిస్సెన్' నగరంలో జన్మించారు. ఇతను అల్లోపతి వెద్యంలో ఎమ్.డి లో పట్టభద్రుడు అయినప్పటికి అల్లోపతి వైద్యము రోగాలను పూర్తిగా నయము చేయడం లేదని, తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తున్నదని గ్రహించి అహర్నిశలు కృషితో, అనేక పరిశోధనలు చేసి హోమియో వైద్యమును మానవాళికి అందించారు. హోమియో వైద్య ఆవిర్భావం : మలేరియా వ్యాధి నివారణకు వాడే సింకోన బెరడు అనేమందు కషాయమును హానిమన్ రోజు తీసుకోవటం వలన మలేరియా జ్వరం రావడం జరిగింది. తరువాత మందును తీసుకోవడం ఆపిన అనంతరం ఇంతకు ముందు కనబడిన లక్షణాలు తగ్గిపోవడం గమనించాడు. ఏమందైతే వ్యాధిని కలుగజేస్తున్నదో అదే మందు వ్యాధిని నివారించటంలో ఉపయోగపడుతున్నదని హానిమన్ మహాశయుడు గ్రహించాడు. ఆనంతరం చాలా రకాల మందులను తన పైన, తన కుటుంబ సభ్యులపైన మరియు తన శిష్యులపై ప్రయోగించుకొని హోమియో వైద్య ఆవిర్భావానికి ఎనలేని కృషి చేసినాడు. హోమియో వైద్యం విశిష్టత : హోమియోపతి అనునది ఒక విశిష్టమైన వైద్య విధానము. రోగపీడిత ప్రజానీకానికి ప్రసాదించిన ఒక గొప్పవరము. ఇటువంటి వైద్య విధానము గూర్చి ఇంకా చాలా మందికి తెలియదు. కొంతమంది తెలిసిన వారుకూడా దీనిని ఉపయోగించకుండా సత్ఫలితాలను సాధించడంలో విఫలమవుతున్నారు.