HOUSE JOURNALS RUPAKALPANA by GOVINDARAJU CHAKRADHAR Telugu book cover

HOUSE JOURNALS RUPAKALPANA

by GOVINDARAJU CHAKRADHAR

₹60
In stock · 7 available
PublisherGOVINDARAJU CHAKRADHAR
LanguageTelugu
తెలుగులో తొలిపుస్తకం జర్నలక్కు 167 ఏళ్ళ చరిత్ర ఉంది. లోవెల్ కాటన్ మిల్స్ అఫ్ అమెరికా వారు లోవెల్ ఆఫరింగ్ పేరిట 1840లో హౌస్ జర్నల్ను ప్రచురించారు. అప్పటి నుంచి అనేక సంస్థలు హౌస్ జర్నల్స్, న్యూస్ లెటర్స్ ప్రచురణలో నిమగ్నమయ్యాయి. ఉద్యోగుల విధేయతను సంస్థ పట్ల పెంపొందించి ఉత్పాదకతను, మంచి ఫలితాలను సాధించడం హౌస్ జర్నల్స్ ప్రచు రణ ప్రధాన లక్ష్యం. సంస్థ యాజమాన్యానికీ సిబ్బం దికీ మధ్య చక్కటి కమ్యూనికేషన్ సాధనంగా హౌస్ జర్నల్ ఉపకరిస్తుంది. యాజమాన్య నిర్ణయాలను, సంస్థ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సంస్థ పట్ల సిబ్బందిలో సానుకూల దృక్పథాన్ని ప్రోది చేయటానికి ఉపకరిస్తాయి. అలాగే సిబ్బంది సమస్యలను వారి మనోభావాలను తెలుసుకుంటూ తదనుగుణంగా యాజమాన్య నిర్ణయాలను మలచు కోవటానికీ దోహదపడుతుంది. ప్రస్తుతం ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో హౌస్ జర్నల్స్ పాత్ర, ప్రాముఖ్యం మరింత పెరిగాయి. ప్రపంచ వాణిజ్యానికి ఎల్లలు చెరిగి పోతున్నాయి. విదేశీ కంపెనీలు మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు మన కంపెనీలు విదేశీ సంస్థలను టేక్వర్ చేస్తున్నాయి. ఈ దృష్ట్యా ఇటు ఉద్యోగులు, అటు కస్టమర్లు సంస్థ కార్యకలాపాల్లో మరింత భాగస్వాములు కాగలిగి నప్పుడే సంస్థ విజయపథంలో ముందుకు సాగుతుంది. ఈ దృష్ట్యా హౌస్ జర్నల్స్ కీలకపాత్ర పోషించనున్నాయి. మన దేశంలో అనేక కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ స్థాయిల్లో హౌస్ జర్నల్స్న వెలువరిస్తూ సిబ్బందితో కస్టమర్లతో సమాచార వారధిని నిర్మిస్తు న్నాయి. వివిధ ప్రచార సాధనాల ద్వారా సమాచారం వెల్లువలా వచ్చిపడుతున్నా, హౌస్ జర్నల్స్ తమ లక్ష్య బృందాలకు విలువైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. హౌస్ జర్నల్స్ ప్రాధాన్యాన్ని గుర్తించి పి.ఆర్.ఎస్.ఐ, ఏటా ఉత్తమ హౌస్ జర్నలు ఎంపికచేసి బహుమతులు అందిస్తోంది. నేను లోగడ ఫర్టిలైజర్ కార్పొ రేషన్లో పని చేసినప్పుడు అన్నపూర్ణ పేరిట తెలుగు, ఇంగ్లీషు భాషల్లో హౌస్ జర్నల్ను ప్రారంభించాను. పత్రిక టైటిల్ పలువురి మన్ననలు పొందింది.