
HRUDAYA JWALA
₹150
In stock · 11 available
PublisherTHE PYRAMID SPIRTUAL TRUST
LanguageTelugu
హృదయం నిత్యనూతన జ్ఞానంలో హృదయం అనేది శరీరానికి నాలుగు నుంచి అంగుళాల దూరంలో భౌతికమైన గుండె వెనుక ద్వాదశ దళ స్వర్ణమయ కమలంగా ఉంటుందని చెప్పబడింది. ఈ హృదయాన్ని అభివృద్ధి చెడుతున్నప్పుడు అనేకస్థాయిల్లో గుర్తించవచ్చు. ఒక్కొక్కప్పుడు అది ఒక చిన్న మొగ్గలా వుంటుంది. ఒక్కొక్కప్పుడు మూడు రేకలు మాత్రమే విచ్చుకుని వుంటుంది. కొన్నిసార్లు రేకలు వివిధ స్థాయిల్లో గట్టిపడి వుంటాయి. ఒక్కోసారి ఈ హృదయం పూర్తిగా వికసించి రేడియోధార్మికశక్తిని ప్రసరించే కమలంగా వుంటుంది. "హృదయం" అనే పదం ప్రేరణలకు కూడా ఉద్దేశింపబడింది. నిజమైన ప్రేరణలు హృదయం నుంచే ఉద్భవిస్తాయి. మనం తీసుకునే నిర్ణయాల్లో 90 శాతం వరకూ హృదయంతోనే చేయబడతాయి. మనస్సు కేవలం ఒక కూలీ మాత్రమే అది పనిచేస్తూ వ్యవస్థీకరిస్తుంది. కానీ అంతిమ నిర్ణయం మాత్రం హృదయం నుంచే వస్తుంది. హృదయం స్వచ్ఛంగా వుంటే ఏ పరిస్థితులలోనైనా మీరు సరైన నిర్ణయాలనే తీసుకుంటారు. ముఖ్యంగా క్లిష్టపరిస్థితుల్లో హృదయం కలుగజేసుకుని తర్కాన్ని, వివేచనాశక్తిని కూడా అదుపులో వుంచి మరీ నిర్ణయాలు తీసుకుంటుంది. మన భౌతికశరీర వ్యవస్థలో సర్వత్రా శక్తిని ప్రసరింపజేసే కేంద్రీయ అవయవంగా కూడా 'హృదయం' అనే పదానికి వర్తింపచేస్తారు. టార్కోమ్ సెరాయ్ డారియన్