HRUDAYA VEENA KAVITHA SAMPUTI by VUDIMUDI NARSAMAMBA Telugu book cover

HRUDAYA VEENA KAVITHA SAMPUTI

by VUDIMUDI NARSAMAMBA

₹50
In stock · 37 available
PublisherVUDIMUDI NARSAMAMBA
LanguageTelugu
హృదయ వీణా కవితా రాగాలు కవిత - ఎన్ని గజాలు ఉన్నదన్నది కాదు. ఏ ఇజానికి కట్టుబడిందన్నదీ కాదు. ఎన్ని నిజాల్ని నిర్భయంగా ఆవిష్కరించిందన్నది ముఖ్యం. ఏది మానవ హృదయాల్ని కదిలిస్తుందో, కలవర పరుస్తుందో, కలత చెందిస్తుందో, ఆలోచింపచేస్తుందో, ఉత్తేజ పరుస్తుందో, ఉత్సాహపరుస్తుందో, ఉమ్మఖత్వానికి దారులు చేస్తుందో, అది ఉత్తమ కవిత..! అది రాసే వారే ఉత్తమ కవి లేదా ఉత్తమ కవయిత్రి అని కీర్తించబడతారు..!! అపుడెపుడో - కాకినాడ ఈశ్వర పుస్తక బాండాగారంలో సభా వేదికపై వుండగా అనుకుంటా, ఎవరోవచ్చి - బాగా నలిగిన ప్రాంతీయ దిన పత్రికలో ముద్రితమైన - "ధనం మూలమిదం జగత్" అనే కవితను అందివ్వడం, ఆ కవితలోని సామాజిక స్పృహకు ఆకర్షితుడనవ్వడం, ఆ కవిత రాసిన సుమారు డబ్భైఏళ్ళ వూడిమూడి నర్సమాంబ గారిని చూసి ఆశ్చర్యపడడం ఒకే సారి జరిగింది. ఎందుకంటె అప్పటికి రెండు మాసాల క్రితం అనుకుంటా.."పాత నోట్లకు చర్మగీతం పాడి, కొత్త పెద్దనోట్లకు నాందీ ప్రస్తావన జరగడం తత్ఫలితంగా సామాన్యులు పనిపాటలు మాని బ్యాంకుల ముందు బారులు తీయడం జరిగింది. ఆ కవితలో "గాయం ఒకచోట / మందు మరో చోట అన్నట్లుంది" - ఈ అల్పాక్షరాల్లో ఎంత అనల్పార్ధం ఇమిడి వుంది..!?! ప్రతిభ ఎక్కడున్నా... ఈ రూపంలో దాగున్నా... ప్రోత్సాహపు పల్లకి ఎక్కించి ఊరేగించే మనస్తత్వం వున్నవాడిని కావడంతో అప్పటికప్పుడు కవయిత్రి నర్సమాంబ గారికి ఘనసన్మానం జరిపించాను. ఆ తర్వాత తెలిసింది "సాగర సంగీతం" కావ్యం రాసిన శ్రీ మాకరాజు కవి "మేనకోడలు... భారత కవి" శ్రీ భల్లం జానకీరామ రామరాజు" మరదలి కుమార్తె కావడంతో ఈమెకి - కవిత్వం- వారసత్వంగానే కాదు, వరసత్వంగా, ఈ ముదిమి ప్రాయంలో కూడా నిండుగా, మెండుగా, దండిగా సుందరంగా సుమధురంగా వరించి పరవశిస్తుందని.... "అందినట్లే అందుతావు అందకుండా పోతున్నావు" అంటూ నయనానందాల మొలకైన సీతాకోక చిలుకను ఎంత గొప్ప బావుకతతో సరళమైన భావంతో భాషతో ఈ కవయిత్రి వర్ణిస్తారో చదివి తీరాల్సిందే.