
HRUDAYAM LO UDAYAM
₹150
In stock · 50 available
PublisherDR.G.SURESH BABU
LanguageTelugu
హృదయం లో ఉదయం డా|| జి. సురేశ్ బాబు "కర్మణోహి ప్రధానత్వం కిం కుర్వన్తి శుభగ్రహః పశిష్ఠ దత్త లగ్నోపి రామః కిం భ్రమతే వనమ్." సాక్షాత్తూ వశిష్ఠ మహామునే శ్రీరామ పట్టాభిషేకం చేయించినా, వనవాసం తప్పించుకోలేక పోయాడారాముడు! కర్మలే ప్రధానం కానీ, శుభ గ్రహాలు-జాతకాలు-ముహూర్తాలంటూ టైం వేస్టు చెయ్యకండి అని చెప్పబడింది. పూర్వమే! చావుబ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడే ప్రాణాలు- స్పృహ నిస్పృహల మధ్య శరీరం చేసే హాహాకారాలు-బంధుమిత్రుల అసహనపు ఆవేదన-కలగలసిన వాతావరణం అక్కడ ఎప్పుడూ తేమగా వుంటుంది. కన్నీటి వర్షపు జల్లులతో లోపలా బైటా ఎప్పుడూ తడుస్తూనే వుంటుంది. అక్కడ మనస్ఫూర్తిగా గలగలా బైటకి నవ్వగలిగిన వ్యక్తి కేవలం డ్యూటీలో వున్న డాక్టరే! అదే క్యాజువాల్టీ గది... ఆస్పత్రిలో, అక్కడికి ఎవరూ ఎప్పుడూ కావాలని రారు, ఖర్మకాలి... రావాల్సొస్తుంది. నలబై ఏళ్ళుంటాయేమో, అప్పుడే గుండె పోటంట! రెస్టారెంటులో భోంచేసి- బాత్రూంలోకెళ్ళి వాంతి చేసుకొని స్పృహ తప్పాడంట. అతనే ఆ రెస్టారెంట్ వోనర్ మిష్టర్ రిషి, హృదయంలో ప్రసూతి నెప్పుల్ని అనుభవించే అవకాశం ఈ మధ్య యుక్త వయస్కులక్కూడా విరివిగా లభిస్తోంది. రిషికి కూడా పిలుపొచ్చింది వచ్చి అడ్మిట్ కమ్మని. ఎంత కమ్మని పిలుపు! ఆహా! నో అన్నావో, చచ్చావే! "రిషి పేషంట్ తాలూకు ఎవరు?" అక్కడున్న వాళ్ళందరి వంకా చూస్తూ అడిగింది డాక్టర్ ఆశ -ఐసియూ తలుపు సగం తెరచి. ఒక వృద్దుడు చెయ్యి లేపి తానే నన్నట్టుగా ముందుకొచ్చాడు. తెల్లని ఖద్దరు చొక్కా పంచె కట్టుకున్న అతను తలమీద స్కార్ఫ్ లేదుగానీ, అచ్చం గుళ్ళోంచి నడచొచ్చిన సాయిబాబా లాగా అన్పించాడు డాక్టర్ అశకు. అతని ముఖంలో అమోఘ తేజస్సు! "మేడమ్ ఆశాగారు! రిషి నా మనవడే!" అన్నాడాయన. ఆశ తేరుకుని, "నాపేరు!.. ఎలా తెల్సు మీకు? మీరు నా పాతపేషంటా?" అడిగింది. "మీ తెల్లకోటు మీద - మీపేరు కుట్టి వుంది."