HRUDAYAVEDANA VANAMLO VIKASINCHINA KAVITA SUMAALU by POTTURI SUBBA RAO Telugu book cover

HRUDAYAVEDANA VANAMLO VIKASINCHINA KAVITA SUMAALU

by POTTURI SUBBA RAO

₹90
In stock · 18 available
PublisherSAHITHI KIRANAM PRACHURANALU
LanguageTelugu
నా మాట మనిషి జీవితం ఎంతో విలువైనది. విలువైన జీవితాన్ని ముందుకు. తీసుకెళ్లటానికి తానెంత ప్రయత్నించినా అంతకుమించిన అవరోధాలు ఎదురవుతున్నాయి. మనం తింటున్నది, కంటున్నది, వింటున్నది... అన్నీ గాడితప్పుతున్నాయి. అందుకు కారణం స్వయంకృత అపరాధమే అని కొందరంటున్నప్పటికీ అది పూర్తిగా నిజం కాదు. మనం ఎంత నిశ్చలంగా నిలడివున్నా అటుపక్క, ఇటుపక్క, ముందూ, వెనుకలనుండి మనల్ని తోసెయ్యటానికి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. తోసేసిన తరువాత కూడా ఇంకా నిశ్చలంగా నిలబడే వున్నాము అనుకునే దుస్థితికి మనం చేరుకునేలా చేస్తున్నాయిప్పుడు ప్రభుత్వాలు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా వెనుక దగా, ముందు దగా కుడిఎడమల దగా దగా... అంతటా దగా ఇప్పుడు రాజ్యమేలుతున్నది. అందుకు కారణం ప్రపంచీకరణ. ప్రపంచీకరణమనేది ప్రపంచమంతటినీ మార్కెట్మయంచేసింది. మన హృదయాలను మనమే మనకు తెలియకుండా మార్కెట్లో తాకట్టు పెట్టుకుంటున్నాము. అందుకే ప్రస్తుత ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు లొంగిపోయి మనల్ని హృదయంలేని మరయంత్రాలుగా మార్చినప్పటికీ స్పందన లేని దుస్థితి ప్రస్తుతం నెలకొని వుంది. కానీ కవి అనేవాడు వీటన్నింటికీ అతీతుడు. ప్రపంచీకరణ సృష్టించిన విధ్వంసాలపై తెలుగు కవులు విజృంభించినట్లుగా మరే భాషాకవి విజృంభించ లేదు. కవుల హృదయ వేదన అనేది ఒక వనమైతే ఆ వనంలో వికసించే సుమాలు కూడా వాడిగా, ముళ్ళై గుచ్చుకుంటాయి. ఈ 'హృదయవేదనవనంలో...' వికసించిన కవితా సుమాలు అలాంటివే. అటువంటి కవిత్వాన్ని అంకితంగా స్వీకరించానికి అంగీకరించిన శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాను. సమాజాన్నే కవితా వస్తువుగా స్వీకరించి భావాన్ని జీవకళగా భావించి అభివ్యక్తిలో నవ్యతను ప్రవేశపెట్టిన కవిగా నన్ను పేర్కొంటూ ఈ కవితా సంపుటిని విశ్లేషించిన డా॥తిరునగరి గారికి నర్వదా కృతజ్ఞుడిని. ఈ కవితా సంపుటికి 'హృదయవేదనవనంలో...' అనే శీర్షిక సూచించటమేగాక ఇది 'విధ్వంసాలపై విప్లవించిన రుద్రవీణ'గా పేర్కొన్న మిత్రుడు మౌనశ్రీమల్లిక్ కూ, సారంతో కూడిన కవిత్వాన్ని రాయగలిగిన కవిగా నాకు శుభాకాంక్షలందించిన తూములూరి రాజేంద్రప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అడుగడుగునా నాకు అండదండలనందించే నా శ్రీమతికి, కుటుంబసభ్యులకూ కృతజ్ఞతాపూర్వక అభినందనలు. ముఖ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దినందుకు చిత్రకారుడు తిరునగరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. కవితలన్నింటినీ డి.టి.పి చేసి అందించిన కలకొండ రామకృష్ణకి, సి. హెచ్. రాముకి, దీనిని సకాలంలో ముద్రించి అందించిన ఆర్.కె.గ్రాఫిక్స్ వారికి కృతజ్ఞతలు.