
HRUDHAYA PADYAM - 100.00
₹100
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Hrudaya Padyam స్పందన మా తర్వాతి తరం కవుల్లో పద్యాన్ని పట్టుకున్న వాళ్లు అరుదు. పట్టి అంచులు ముట్టినవాళ్ళు వేళ్ళు దాటిపోరు. బాపురెడ్డి పద్య విద్యామర్మజ్ఞుడు. ప్రౌఢ పద్యకవుల పంక్తిలో కూర్చునే పద్యాలు ఎన్నెన్నో రాశాడు. - డా. సి.నారాయణరెడ్డి విదేశాలకు వెళ్లే వాళ్ళందరు మొత్తం మీద ఏదో ఒకటి పొగొట్టుకుని వస్తారు. బాపురెడ్డి మాత్రం అక్కడక్కడి అపూర్వ సౌందర్యాలన్నింటినీ మూటకట్టుక తెచ్చి, తెలుగు సరస్వతికి అమూల్యాభరణాలుగా కూర్చి తీర్చిదిద్దాడు. డాక్టర్బోయి భీమన్న బాపురెడ్డి సాహిత్యభాషలో నుంచి పరిమళభరితమైన శబ్దాన్ని ఏరుకోవడంలో గొప్ప ప్రవీణుడు. శబ్దాలు మృదుని కుసుమాదపి. వాటిని పద్యపాదాలుగా అల్లి శ్రోతను సమ్మోహితుడ్ని చేయడంలో అద్వితీయ ఇంద్రజాలికుడు.... శ్రీ బాపురెడ్డి తెలుగు సాహిత్యంలో వరణీయ కవుల్లో గణనీయుడు, స్మరణీయుడు అని నిరాఘాటంగా చెప్పవచ్చును. గుంటూరు శేషేంద్రశర్మ డా॥ జె. బాపురెడ్డిగారు సహజ కవులు. నిరంతరాన్వేషకులు. ప్రపంచం నలుమూలలా పర్యటించిన ప్రతిభావంతులు. అటు వేదాంతాన్ని జీవిత సత్యాలతో వ్యాఖ్యానించే తత్త్వవేత్త. ఇటు తత్వసాగరాన్ని సౌందర్య బాహువులతో ఈదగలిగిన రసిక వీరులు. అన్ని రసాలు స్నేహరసంలోనే పుట్టి పెరిగి లయిస్తాయన్న రసరహస్యాన్ని బోధించే దార్శనికుడు. - ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం పద్మమ్ము గద్యమ్ము పదనుగా కదనుగా గుప్పించగల కళాకోవిదుండు గేయమ్ము ధ్యేయమ్ము ఖేలాసమమ్ముగా సంధించు, సుకవితా సవ్యసాచి ప్రణయమ్ము ప్రణవమ్ము పాలుతేనియలుగా కలిపి వడ్డించు ప్రజ్ఞానశాలి అనుభూతి జనగీతి అసమానరీతి అలాపించు గానకళావిదుండు. - డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి మహాకవులెవ్వరూ సమన్వయం చెయ్యని, సందేశం లేని కావ్యాలు వ్రాయలేదు. బాపురెడ్డిగారు తన కవిత్వానికి సమన్వయం ప్రాణంగా చేసుకోగలిగాడు. ఇందువల్లనే ఈయన కవిత్వంలో దేహానికి, మనస్సుకు, బుద్ధికి సముచిత స్థానాలు లభించడమే కాకుడా చాలా మంది ఆధునిక కవులలో కనబడని అతీంద్రియమైన ఆత్మవస్తువుతో వీటికి సమన్వయం చేసే ప్రయత్నం కనబడుతుంది. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు నిత్యహరితంగా, సత్యభరితంగా కాలంతో అడుగులు వేస్తూ కదులుతున్న కవితా హృదయుడు డా.జె. బాపురెడ్డి. పద్యం పరిమళవంతంగానూ, మాత్రఛందం మృధుమధురంగానూ, కవిత్వ వచనం కమనీయంగా శ్రుతిచేస్తున్న ఆధునిక అగ్రశ్రేణి కవులలో గణనీయుడు. ఆయన కవిత్వం గంగ, భావం యమున, అభివ్యక్తి సరస్వతి ఆయన త్రివేణీ సంగమం.