HUG ME QUICK by DR.K.L.V.PRASAD Telugu book cover

HUG ME QUICK

by DR.K.L.V.PRASAD

₹150
In stock · 22 available
PublisherDR.K.L.V.PRASAD
LanguageTelugu
నామాట వందేళ్ళ కథాలోకంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా వుంది. కథ నాకు యిష్టమైన సాహిత్య ప్రక్రియ. దానిని అందుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. 'కథ నేనూ రాయగలను' అన్న నమ్మకం కుదిరాక, వాటిని పుస్తకం రూపంలో తీసుకురావడానికి సంశయించిన మాట వాస్తవం. తదనుగుణంగా మొదటి కథా సంకలనం తీసుకురావడానికి చాలా కాలం పట్టింది. ప్రసిద్ధ రచయితలు కీ॥శే॥డా. పి.వి. రమణ, కీ॥శే॥ పేర్వారం జగన్నాధం, డా॥ అంపశయ్య నవీన్, డా॥మధుసూదన్ కానేటిగార్ల ప్రోత్సాహంతో నా మొదటి కథా సంపుటి 'కె. ఎల్వీ కథలు' వెలుగు చూసింది. పాఠకుల నుండి లభించిన అపూర్వమయిన స్పందన నా రెండో కథల సంపుటి 'అస్త్రం - చిన్న కథలు' తీసుకురావడానికి గొప్ప ఊతం ఇచ్చింది. నా జీవిత కాలంలో కనీసం మూడు కథా సంపుటాలు తీసుకు రావాలన్నది నా కోరిక. ఈ కోరిక తీరుతుందా? అన్నది నన్ను చాలాకాలం వేధించిన ప్రశ్న. నా ఆలోచన, ధ్యేయం నెరవేరి మూడో కథల సంపుటి 'హగ్ మి క్విక్' తీసుకువచ్చే అవకాశం కలిగింది. దీనిని కూడా పాఠక మహాశయులు ఆదరించినట్లయితే, నా జన్మ ధన్యమైనట్లే. ఒక దశలో నా జీవితం అగమ్య గోచరంగా మారినవేళ నా భవిష్యత్తునుగూర్చి బంగారు కలలు కనే విధంగా నన్ను ప్రేరేపించిన వాడు, మా చిన్నన్నయ్య డా. మధుసూదన్ కానేటి, ఈ కథా సంపుటిని ఆయనకు నా ప్రేమ కానుకగా అంకితమిస్తున్నాను. నా జీవితం ధన్యమయిందని భావిస్తున్నాను. నా మీద అమిత వాత్సల్యంతో, పద్యాలు రాసి ఆశీర్వదించిన గౌ॥ దుగ్గిరాల సోమేశ్వరరావుగారికి, తన మిత్ర వాక్యాన్ని కార్టూన్ రూపంలో అందించిన నా మంచి మిత్రులు ప్రముఖ కార్టూనిస్ట్ 'సరసి'గారికి, ఈ కథా సంపుటిని ఆనందంగా అంకితం తీసుకుంటున్న చిన్నన్నయ్య డా॥మధుసూదన్ కానేటి (ఆకాశవాణి విశాఖపట్నం) గారికి, పుస్తకాన్ని అందంగా ముద్రించి యిచ్చిన మిత్రులు 'చినుకు' రాజగోపాల్గారికి, నా కథలు ప్రచురించిన వివిధ పత్రికాధిపతులకు, ప్రసారం చేసిన ఆకాశవాణి వరంగల్ కేంద్రం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు