
HYDERABAD JANA JEEVITHAMLO URDU SAMETHALU
₹30
In stock · 20 available
PublisherPARAVASTU LOKESWAR
LanguageTelugu
ఈ ఉర్దూ సామెతల పుస్తకం ఉర్దూ భాషలో 'ముహావరా' అంటే సామెతలు అని అర్ధం. ఒక ప్రత్యేక ప్రాంతంలో అక్కడ నివసించే ప్రజల వైవిధ్య భరిత విస్తృత జీవితానుభవాల సారాం శమే సామెతలు. ప్రతి సామెత వెనుక ఒక లోకోక్తి ఒక నీతికథ దాగి ఉంటుంది. ప్రజల వాడుక భాషలో సామెతలు ఒక విడదీయరాని అంతర్భాగం. కాలక్రమేణా సామెతలు ఒక సంప్రదాయంగా మారిపోతాయి. హైద్రాబాద్ నగర ప్రజల జీవితంలో ఉర్దూ సామెతలకు విశిష్టమైన స్థానం ఉంది. నాలుగు వందల సంవత్సరాల నగర సంస్కృతిలో ఉర్దూ సామెతలు తెలుగు భాషలో 'పాన్ సుపారీ' లాగా కల్సిపోయాయి. హైద్రాబాద్ నగర గంగా జమునా తెహజీబ్కు (సంస్కృతి) ఈ సామెతలు ఒక మంచి ఉదాహరణ. ఈ నగర ప్రజలు తెలుగులో మాట్లాడుకుంటనే అనుకోకుండా, అలవోకగా ఉర్దూ సామెతలను తమ సంభాషణలో చొప్పిస్తూ ఉంటారు. ఈ సామెతల మరో ప్రత్యేకత 'హాస్యరసం' ఎంతటి గంభీర చర్చలలోనైనా ఈ సామెతల వాడకం వలన మనుషుల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడి 'వాడివేడివాద వివాదాలు' మేఘాలవలె పలుచబడి తేలిపోతాయి. ప్రతిధ్వందుల హృదయాలు తేలిక అవుతాయి.