
HYDERABAD NADU NEDU
by SISHTLA LAKSHMIPATHI SASTRI
₹50
In stock · 11 available
PublisherSISHTLA LAKSHMIPATHI SASTRI
LanguageTelugu
ప్రస్తావన హైదరాబాద్ నగర చరిత్రను ఎందరో కవులు, రచయితలు తమకు తోచిన విధంగా వర్ణించారు. "చార్మినార్ మీద ఎగిరే పావురాలు శాంతి పతాకాలై కనిపించేవి. బాగే ఆం (పబ్లిక్ వార్డెన్)లో పచ్చని గడ్డిమీద పాదాలు మోపితే చిరకాల రోగులు ఆరోగ్యవంతు అయ్యేవారు. 'ఫవ్వారా' (ఫౌంటెన్)లోని జలకణాలు తలలమీద చల్లదనాలు చల్లేవి. ఏడాదికి పదినెలలు వాతావరణం చల్లగా ఉండేది. ఏప్రిల్, మే మాసాల్లో వేడిగా ఉండేది. అంతే. గుల్ మొహర్ పూలు ఎక్కడ పడితే అక్కడ కన్నులకు విందు చేస్తుండేవి" ఇది మహాకవి డా|| దాశరథిగారి వర్ణన. 'అప్పుడు హైదరాబాద్ సంధ్యలో శిరస్పెత్తిన గులాబీలా ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం, తీయని నీళ్ళు, పచ్చని చెట్లతో ఉద్యానవనంలా ఉండేదని' హిందీ కవయిత్రి ఇందిరా ధమ్రాజ్ గిర్గారి అభిప్రాయం. ఇప్పుడు శిష్ట్లా లక్ష్మీపతిశాస్త్రిగారు తాము చదువుకున్నవాటి, ఉద్యోగం చేసిన వాటి రోజులను జ్ఞాపకం చేసుకొని రసవత్తరంగా 'హైదరాబాద్ నాడు-నేడు' అనే గ్రంథాన్ని రచించారు. 610 జి.వో. పై తర్జనలు, భర్జనలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఈ గ్రంథం రావడం సమయోచితంగా ఉంది. తన రాష్ట్రంలోని ఉద్యోగాలు తన రాష్ట్రవాసులకే పరిమితం చేస్తూ నిజాం నవాబు చట్టం తెచ్చాడు. అదే ముల్కీ చట్టం. నిజాం రాష్ట్రంలో ఉద్యోగం సంపాదించుకోవాలంటే నిజాం రాష్ట్రంలో పుట్టి అయినా ఉండాలి. లేదా అక్కడి మనిషిని వివాహం చేసుకొని ఉండాలి లేదా పదిహేను సంవత్సరాలు నిజాం రాష్ట్రంలో నివాసంగా అయినా ఉండాలి. ఇది మొదటి నిబంధన. నిబంధన దారి దాన్దే. వచ్చిన గైర్ ముల్కీలు వస్తుండేవారు. ఏ భాష వారైతేనేం? హైదరాబాద్ రాష్ట్రం విచ్ఛిన్నమయ్యే నాటికి ఉద్యోగంలో ఉన్నవారు చాలామంది సర్టిఫికేట్లు పొందిన ముల్కీలే. ముల్కీ సర్టిఫికేట్లు ఖరీదుకు సులభంగా దొరికేవి.