
HYDERABAD SIRF HAMAARA
by NIDHI
₹25
In stock · 26 available
PublisherADUGUJADALU PUBLICATIONS
LanguageTelugu
హైద్రాబాదు సిర్ఫ్ హమారా సీమాంధ్ర నేతలు కేంద్రం తెలంగాణకు సానుకూలప్రకటన చేయగానే తెలుగుజాతిని చీల్చేస్తారా అని గుండెలు బాదుకుంటున్నారు. హైద్రాబాద్ అభివృద్ధిలో మా వాటా ఉందన్న వాదనలు లేవనెత్తారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలంగాణ కవులు, రచయితలు సృజన శీలురుగా కదిలారు. "హైద్రాబాద్ సిర్ఫ్ హమారా” అని నినదించారు. హైద్రాబాద్ తెలంగాణ అంతర్భాగమని, తెలంగాణ నుంచి హైద్రాబాద్ను హైద్రాబాద్ నుంచి తెలంగాణను వేరుచేసి చూసే కుట్రలపై కవులు ఆగ్రహించారు. 1951లనుంచి ఇప్పటి వరకు హైద్రాబాద్పై కన్నేయటంపై కవులు, రచయితలు తమ కలాలద్వారా గర్జించారు. హైద్రాబాద్ కూడిన తెలంగాణ కావాలని ఇందుకు వేరే ప్రత్యామ్నాయం లేదని సాహిత్యలోకం ముందుకు సాగింది. స్వరాష్ట్ర ఉద్యమం ముగింపు దశకు చేరుకునే సందర్భంలో సీమాంధ్రులకుట్రలను తమ రచనలద్వారా బైటపెట్టారు. అప్రమత్తంగా ఉండగలిగినప్పుడే ఈ రకమైన చారిత్రక పాత్రను పోషించగలుగుతారు. అందుకే తెలంగాణ కవులు చరిత్రను మలుపుతిప్పిన కవులుగా విశ్వవేదికపై నిలుస్తారు. హైద్రాబాద్పై కదిలిస్తే కవిత్వం వడగండ్ల వానగా మారింది. పిడుగుల్లా కవితలు పేలాయి. కవిత్వం ఉద్యమ మెరుపై మెరిసింది. "హైద్రాబాద్ సిర్ఫ్ హమారా” అన్నది ఒక సునామిలా మారింది. ఈ కవిత్వ నదులు ఒక్కసారిగా ఉప్పొంగినాయి. కవులు ఎడతెరపకుండా కవిత్వ వర్షంలా కురిసారు. ఈ కవిత్వ ప్రవాహంలో మారేడుకొండ బ్రహ్మాచారి (నిధి) ఉప్పొంగాడు. జూలూరు గౌరీశంకర్