HYDERABAD VIMUKTHI PORATAM by A.PANDARINATH Telugu book cover

HYDERABAD VIMUKTHI PORATAM

by A.PANDARINATH

₹100
In stock · 4 available
PublisherA.PANDARINATH
LanguageTelugu
హైదరాబాద్ విముక్తి పోరాటం 1. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ భారతదేశంలోని దేశీయ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలన్నింటిలోనూ హైదరాబాద్ సంస్థానం చాలా పెద్దది. దీని వైశాల్యం 82,698 చ.మైళ్లు. ఇందులో తెలంగాణ భూ భాగం 41,502 చ.మైళ్లు. బ్రిటిష్ ఇండియాలోని ఏ సంస్థానానికీ లేని అధికారాలు, సదుపాయాలు ఈ స్టేటుకు ఉండేవి. స్వతంత్ర కరెన్సీ (హాలీ రూపాయలు అనేవారు - అప్పటి కరెన్సీని) తంతి, తపాలా, రైల్వే శాఖలు కూడా ఈ ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న అత్రాఫ్ బల్దా జిల్లా మొత్తం ఆదాయం నిజాం స్వంత ఖర్చులకు తీసుకునేవారు. దీనిని "సర్పెఖాస్" అనేవారు. ఇది కాక ఆయనకు వివిధ జిల్లాలలో ఇంకా కొన్ని సర్ఫేఖాస్ జాగీర్ గ్రామాలు కూడా ఉండేవి. సంస్థానమంతటా చిన్నా, పెద్ద కలిపి దాదాపు 11 వందల మంది జాగీర్దార్లు, సంస్థానాధిపతులు, దేశ్ ముఖ్, దేశ్ పాండ్యాలు ఉండేవారు. ఈ జాగీర్దార్లలో చాలా మంది హైదరాబాద్ నగరంలో విలాస జీవితం గడుపుతూ కాలక్షేపం చేసేవారు. వీరంతా తమ జాగీర్లలో సర్వాధికారులు. వీరి తరపున వారి ఉద్యోగ బృందం గ్రామాలలో నిరంకుశాధికారం చెలాయించేవారు. అధిక పన్నులు, వెట్టి చాకిరీతో ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది. రైతులను నిలువు దోపిడీ చేసేవారు. గ్రామీణ ప్రజలపై నిజాం ప్రభుత్వ ఉద్యోగులు, వారి తాబేదార్లు చేసే అఘాయిత్యాలు, అమానుష కృత్యాలు, అత్యాచారాలకు అంతే లేదు. ఇక సంస్థానంలో పౌరహక్కులు మృగ్యం. సభలు, సమావేశాలు జరుపుకోవటానికి కూడా ప్రభుత్వ అనుమతి అవసరమయ్యేది. వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం ఏ మాత్రం ఉండేవి కావు. ఇలాంటి అంధకారంలో ఆనాటి ప్రజలున్నారు.