
I AM IN LOVE
₹200
In stock · 9 available
PublisherS.VIJAYABHASKAR
LanguageTelugu
“ఐ యామ్ ఇన్ లవ్...” 1 నా పేరు 'ఓల్గా'! ఏమిటి ఇది తెలుగు పదంలా లేదే.. లేదా ప్రింటింగ్ మిస్టేకా? అని రకరకాలుగా అనుకొంటున్నారేమో. అయినా మీలో చాలా మందికి తెలిసే వుంటుంది. 'ఓల్గా' అనేది ఓ రష్యన్ పదం. నేను పదహారేళ్ల రష్యన్ అమ్మాయిని.. అందంగా ఉంటానా లేదా అని మళ్ళీ ఆలోచిస్తున్నారా! అఫ్కోర్స్, మరీ అంత అందంగా లేకపోయినా 'అందం'గానే వుంటాను. అయినా, 'అందం' అనేది హృదయానికి సంబంధించినదని నా నమ్మకం. ముఖాలు ఎలా ఉన్న, మన హృదయాలు మంచివయితే మనం అందంగానే ఉన్నట్టులెక్క! మాది మాస్కో నగరం. మా ఇల్లు మరీ పెద్దదేమీ కాదు, కానీ అది నగరం నడిబొడ్డు ప్రాంతంలోని లెసన్యా వీధిలో ఉంది. కాబట్టి మా యింటి నుండి, నా కాలేజీ, నాన్నగారి ఆఫీసు, అమ్మ పని చేసే స్కూలు అన్నీ దగ్గరే. ఇది శీతాకాలం గదా, బాగా చలిగాఉంది. బయట మంచు ఉధృతంగా కురుస్తుంది. గడియారం ఉదయం ఏడు గంటలు కొట్టింది. అమ్మ కిచెన్లో నుండి కేక వేసింది. “ఓల్గా, నీకు కాలేజికి వెళ్ళే సమయం అవుతుంది త్వరగా తెములు" నిజానికి 'ఓల్గా' అనేది ప్రవహించే ఓ నది. అదీ మా దేశంలోనే ప్రవహిస్తుంది లెండి. నా మాటలు మరీ నదిలా ప్రవహిస్తున్నాయనేమో, అమ్మ 'మారియా', నాన్న 'వ్లాడిమిర్'లు నాకు 'ఓల్గా' అని పేరు పెట్టారు. నేను నా రెండేళ్ళ ప్రాయంలోనే మాట్లాడటం మొదల పెట్టానట. అయితే ఈ మధ్యకాలంలో కాస్తంత 'ఇంగ్లీషు' కూడ నేర్చుకొన్నాను. గబ గబా ఉన్ని దుస్తులు ధరించి, 'అమ్మా, వెళ్ళొస్తాను!' అంటూ, తలుపు లాగేస్తూ, బయటికి వచ్చాను. 'అమ్మ, లోపలి నుండి గట్టిగా కేకవేసింది' ఓల్గా జాగ్రత్త! కాలేజి నుండి తిన్నగా, త్వరగా ఇంటికి వచ్చేయ్! అసలేరోజులు బాగోలేవు!" అమ్మ మాటలు విన్న నా కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. వెనుదిరిగి 'కాలింగ్ బెల్ నొక్కాను అమ్మ తలుపు తీసి, "ఏంటి? ఏం మర్చిపోయావు?" అని అడిగింది. "ఏం లేదు, నా ప్రియమైన అమ్మా, ఓ విషయం నీతో చెప్పాలి... | 'ఐ యామ్ ఇన్ లవ్' |