I.V.S. ACHYUTHAVALLI NAVALA SAHITYAM by DR.K.B.LAKSHMI Telugu book cover

I.V.S. ACHYUTHAVALLI NAVALA SAHITYAM

by DR.K.B.LAKSHMI

₹80
In stock · 2 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
ఈ పరిశోధన గురించి... నాలుగున్నర దశాబ్దాల కిందట ఆరో దశకంలో పురుషులు ఆడపేర్లతో నవలలు రాసి గుర్తింపు తెచ్చుకోవలసిన పరిస్థితిని స్త్రీ రచయిత్రులు కల్పించారు. ఆడవాళ్ళు వంటింటి సాహిత్యాన్ని సృష్టిస్తున్నారన్న అపప్రధ పుట్టించినా గరిటతో సమంగా కలం తిప్పిన రచయిత్రుల ఉధృతి ఆగలేదు. నవలామణుల ప్రవేశంతో నవలారచన కొత్తపుంతలు తొక్కింది. నవనవోన్మేషంగా విరాజిల్లింది. ఆ ఉధృతి నిరాఘాటంగా దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కొనసాగింది. అచ్యుతవల్లి ముందుతరంలో విశ్వనాథ, చలం, ఉన్నవ లక్షీనారాయణ, డా.ఉప్పల లక్షణరావు, గోపీచంద్, శ్రీదేవి- తన సమకాలికులైన రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, లత తదితర రచయిత్రుల రచనలతో తెలుగు నవలా వికాసం జరిగింది. 1960-80 దశకంలో ఆధునిక నవలా యుగానికి ప్రాతినిథ్యం వహించిన ఎందరో నవలామణులున్నప్పటికీ ఐ.వి.యస్. అచ్యుతవల్లి విభిన్న వినూత్న సాహితీలోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్త్రీ, పురుష సంబంధాలకు, స్వాతంత్ర్యానంతర మానవీయ విలువలకు, స్త్రీ సమస్యా ప్రధానమైన అంశాలకు ప్రాముఖ్యతనిచ్చి మనోవిశ్లేషణాత్మక రచనలు చేశారు. సంప్రదాయబద్ధమైన అభ్యుదయవాదం ఆమెది. విద్యావతి అయిన స్త్రీ వ్యక్తిత్వ సంస్కారంతో తన జీవితాన్ని తానే చక్కదిద్దుకోగలదనీ, చదువు, ఉద్యోగం, వివాహం, మాతృత్వం తదితర విషయాల్లో తన జీవితాన్ని తాను శాసించుకోవడమే కాకుండా ఎదుటి వ్యక్తుల జీవితాలను, ఆలోచనా సరళిని కూడా చక్కదిద్దగలుగుతుందని నిర్ద్వంద్వంగా చెప్పారు తన నవలల్లో. చలం స్త్రీకి ధిక్కరించడం నేర్పాడు. కానీ నిలదొక్కుకోడానికి పథనిర్దేశం చేయలేదు. గోపీచంద్ మన వివాహవ్యవస్థ స్త్రీ అభివృద్ధికి మరీ ఇరుకైపోయిందన్నాడు. సంప్రదాయాన్ని ఎదిరించలేక, అలా అని సంప్రదాయాన్ని అనుసరించలేక మధ్యేమార్గాన్ని అనుసరించారు తదనంతర రచయిత్రులు. అయితే వాస్తవిక దృష్టితో, సంప్రదాయ విలువలను నిలబెడుతూ, కుటుంబ వ్యవస్థను ఆదరిస్తూకూడా ప్రగతిశీల అభ్యుదయవాదంతో పాత్రలను సృష్టించి తన సమకాలీన రచయిత్రులకంటే" కాలానికి ముందు నిలిచిన రచయిత్రిగా ఐ.వి.యస్. అచ్యుతవల్లి నవలల విశిష్టతను వెలుగులోకి తీసుకు రావడమే నా పరిశోధన ప్రధాన ఉద్దేశం.