
IDHI GUNDE GUTTU
₹60
In stock · 7 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ఇదీ గుండె గుట్టు “ఇంతవరకూ అతను చక్కగా మాట్లాడుతున్నాడు. హఠాత్తుగా గుండె పట్టుకున్నాడు. అంతే... క్షణాల్లో ప్రాణం పోయింది!" ఇలాంటి వార్తలు యీమధ్య మనం ఎక్కువగా వింటున్నాం. అంత వరకూ చక్కగా పనిచేస్తున్న గుండె అంత హఠాత్తుగా ఎందుకు ఆగిపోయింది? ఈ గుండెజబ్బు మనిషి ఉన్నత శిఖరాల్ని అధిరోహించి ఉన్నతిని సాధించే రోజుల్లో గొడ్డలిపెట్టులా వచ్చి, మొత్తం జీవితాన్నే కబళించి వేస్తోంది. ఇలా మానవాభ్యుదయానికి ఇది పెద్ద అవరోధంగా తయారైంది. ఒక సర్వే ప్రకారం 1985వ సంవత్సరంలో బొంబాయిలో 53 వేల మరణాల్ని పరీక్షిస్తే వాటిలో 18 వేల మంది గుండెజబ్బుతోనే మరణించారని తేలింది. పల్లెలలోకన్నా పట్టణాలలోనే ఈ గుండె జబ్బు అధికంగా ప్రాణాల్ని తీస్తోందని తేటతెల్లమవుతోంది. కాలం గడిచేకొద్దీ గుండెజబ్బు మరణాలు ఎక్కువవు తున్నాయి. అమెరికా లాంటి అగ్రదేశాలలో దీని ప్రభావం మరీ ఎక్కువ. కాబట్టి మనకి స్పష్టంగా అర్థమవుతోంది- ఆధునిక, యాంత్రిక జీవనాన్ని గడపడం వల్లనే ఈ జబ్బు పెరుగుతోందని! అసలు గుండె ఎక్కడుంది? ఏఏ పనులు చేస్తుంది? ఏఏ పరిస్థితుల్లో గుండెజబ్బులు ఎలా వస్తాయి? వాటిని ముందుగా పసిగట్టడానికి వీలుందా? గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఒక వేళ గుండె జబ్బులు ఇది గుండె గుట్టు)