IDU HAMSALU by DR.V.CHANDRA SHEKARA RAO Telugu book cover

IDU HAMSALU

by DR.V.CHANDRA SHEKARA RAO

₹75
In stock · 1 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'ఆటా' నవల 'వార్త' దినపత్రిక సహకారంతో 'ఆటా' నవలల పోటీ జరగడం యిది రెండవసారి. క్రితంసారి పోటీలో మూడు నవలలు, రెండు నాటకాలు బహుమతులందుకున్నాయి. వాటిలో 'పంచమం', 'కాడి' నవలలు ఇంగ్లీషులో ప్రచురించబోతున్నట్లు వార్తలందుతున్నాయి. మొదటి బహుమతి నవల 'వలసదేవర' కూడా ఇంగ్లీషులోను, ఇతర భాషల్లోను త్వరలోనే దొరుకుతుందని ఆశిస్తున్నాను. నాటకాల్లో మొదటి బహుమతినందుకున్న 'పడమటి గాలి' ప్రదర్శన ఈ మధ్యనే హైదరాబాదు నగరాన్ని కదిలించినట్లు తెలిసింది. ఈ తడవ పోటీ నవల, నాటక రచనలోనే కాక, కథా, కవితా, వ్యాసరచనలో కూడా జరిగింది. ఒక్క నాటక రచనలో తప్ప మిగిలిన ప్రక్రియలన్నింటా బహుమతి యోగ్యమైన రచనలందడం, వాటిని ఎన్నుకోవడం జరిగింది. నవలల్లో డా॥ కాలువ మల్లయ్యగారి 'బతుకు పుస్తకం', డా|| వి.చంద్రశేఖరరావుగారి 'ఐదు హంసలు' చెరి 50,000 రూపాయలు పారితోషికం అందుకున్నాయి. బతుకు పుస్తకం: గత ఐదు దశాబ్దాలుగా గ్రామ జీవితంలోని పరిణామాల్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించిన నవల యిది. ఇందులో పాత్రలు అనేకం. సంభాషణలూ, స్వగతాలూ, మనోగతాలూ తెలంగాణా మాండలికంలో నడుస్తాయి. రచయితకు తాను చిత్రించిన జీవితంతో అతి సన్నిహితమైన సంబంధబాంధవ్యాలున్నాయి. అందువల్ల నవల సజీవమయ్యింది. మనుషులందరూ పరిచయస్థులుగా అనిపిస్తారు. వాతావరణం దృశ్యమానమౌతుంది. నుడి, నానుడి కలగలసి తెలుగుదనాన్ని ప్రతిష్టిస్తాయి. కథనం ఏకబిగిన సాగకపోయినా, కృతకమైన నాటకీయత లేకపోయినా సీరియస్ పాఠకుడి చేత చివరి వరకూ చదివించగల నవల్." తెలుగు జీవితంలోని సమీప గత పరిణామక్రమాన్ని పరిశీలించిన నవలల్లో బతుకు పుస్తకం కూడా తగు స్థానాన్ని ఆక్రమిస్తుంది.