INDIAN NAVALIKALU by CHANDU SUBBARAO Telugu book cover

INDIAN NAVALIKALU

by CHANDU SUBBARAO

₹200
In stock · 368 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
INDIAN (Navalikalu) Prof. Chandu Subba Rao చందు రచనల్లో జీవితరంగ సాన్నిహిత్యం ఉంటుంది. అది అతని అనుభవ ప్రపంచానికీ లోకానుశీలతకూ గుర్తు. తీవ్రమైన భావుకత్వం ఉంటుంది. అది కవిత్వ హృదయానికుండే సాంద్రమైన అనుభూతికి సంకేతం. ప్రగాఢమైన సాహిత్య పరిచయం చందూ రచనల్లో కనిపిస్తుంది. సామాజిక శాస్త్రాలతో బాటు విజ్ఞాన శాస్త్రాల మేళనం ఉంటుంది. ఉదార వామపక్షానుకూల ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. చాలామంది తెలుగు నవలాకారులకు, రచయితలకు, పండితులకు లేని శక్తిమంతమైన శైలి చందూ నవలల్లో కనిపిస్తుంది. సూటిదనం, స్పష్టతా, గాంభీర్యం, హాస్యం, కొంటెతనం, వ్యంగ్యం చందూ కంఠస్వరంలో చూడవచ్చు. కథనంలో ప్రసన్నత ఉంటుంది. వేగం ఉంటుంది. ఈ రెండింటి వెనుక పాఠకున్ని ఆలోచనాత్మకమైన జీవానాంశాలవైపు సామాజిక పరివర్తన వైపు సామూహిక సద్వర్తన వైపు మానవుడు సాధించ గలిగే శాస్త్ర విజ్ఞానాంశాలపై మళ్ళించే లక్షణం ఉంటుంది. కేతు విశ్వనాథరెడ్డి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004