
INKONNI SCIENCE SANGATHULU
₹30
In stock · 1 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందు మాట ఈ ప్రపంచంలో రోజురోజుకి ఎన్నో కొత్త సంగతులు తెలియవస్తున్నాయి. వాటన్నింటిని కాకపోయినా కొన్నింటినయినా తెలుసుకోకపోతే మనం వెనుకబడి పోతాం. అందుకోసమే యీ సైన్స్ సంగతులు. ఈ వ్యాసాలన్నీ ఆదివారం అంధ్ర జ్యోతిలో ప్రచురితమయినాయి. కాబట్టి వీటిలో కొన్నింటికి తరువాత అదనంగా సమాధారం వచ్చి ఉండవచ్చును. ఆ సమాచారం ముఖ్యమయినదయితే దాన్ని గురించి మళ్ళీ ఒక వ్యాసం వ్రాశాను. ఉదాహరణకు పవిత్ర వస్త్రం విషయాన్ని చెప్పుకోవచ్చు. సైన్సులో అదనపు సమాచారం రావడం కొత్తకాదు. అలాగని పాత విషయాలు పనికిరాకుండాపోవు! సైన్సు సంగతులు ఇప్పటికి రెండు సంపుటాలు వచ్చాయి. ఇది మూడవది. వీటిని ఏ సంపుటానికదే చదివినా అది అసంపూర్తి మాత్రం కాదు. నా కలెక్షన్లో లేని వ్యాసాల ప్రతులను అందజేసిన సుధామగారికి, ఆంధ్ర జ్యోతి వారికి నా ధన్యవాదాలు. పాపులర్ సైన్సు వ్యాసాలు కేవలం పిల్లల కోసం అనుకోకుండా పెద్దలు మాడా పుస్తకాన్ని చదివితే సంతోషిస్తాను. జ్ఞానవ్యాప్తి అనే కృషిలో నేను కూడా. పాలుపంచుకుంటున్నానన్న సంతృప్తితో - కె. బి. గోపాలం