INTHAKU INTHE by POLKAMPALLI SANTHADEVI Telugu book cover

INTHAKU INTHE

by POLKAMPALLI SANTHADEVI

₹150
In stock · 12 available
PublisherSURYA PRACHURANALU
LanguageTelugu
నా మాట ఇంతవరకూ నేను దాదాపు 75 కథలు, 62 నవలలు రాశాను. నవలలన్నీ పుస్తకాలుగా వచ్చినా కథలు మాత్రం పుస్తక రూపంలో ఆలస్యంగా వస్తున్నాయి. అందుకు కారణం వాటిని నా అజాగ్రత్తవల్ల పోగొట్టుకోవడం జరిగింది. కొన్నింటిని మాత్రం కథానిలయం' నుంచి తిరిగి పొందడం గొప్ప అదృష్టం. నేడు అన్ని ఆధునిక సాంకేతిక సౌకర్యాలున్నా పుస్తకం అచ్చువేసుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకొన్న పని. ఎంతో కష్టపడి వేసుకున్నా కొనేవాళ్ళు కరువు. మన రాష్ట్ర ప్రభుత్వమైనా గ్రంథాలయాలకు కొని ప్రోత్సహిస్తుందా అంటే అదీలేదు. అదే పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు రచయితల నుంచి నేరుగా పుస్తకాలు కొని ప్రోత్సహిస్తుంది. వాళ్ళను చూసైన నేర్చుకుంటే రచయితలు బాగుపడతారు. తెలుగు భాష వికాసం చెందుతుంది. ఆ శుభఘడియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం తప్పు చేసేదేమీ లేదు. నా కథాసంపుటాలను అచ్చువేయాలనుకున్నప్పుడు పుస్తకాలను అందంగా అచ్చు తప్పుల్లేకుండా అచ్చువేయడంలో ప్రసిద్ధులైన 'పుస్తకశిల్పి' శ్రీ తాళ్ళపల్లి మురళీధరగౌడుగారిని సంప్రదించినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం నాకు సంతోషాన్ని కలిగించింది. వారి సహకారంతోనే 2010లో నా మొదటి కథాసంపుటి 'మరణం అంచున మందహాసం', 2012లో రెండవ సంపుటి 'గుర్తుకొస్తున్నాయి' వెలువడ్డాయి. ఇప్పుడు ముచ్చటగా నా మూడో పుస్తకం 'ఇంతకు ఇంతే మీ చేతిలో ఉంది. వారికి నా ధన్యవాదాలు. చక్కటి ముఖచిత్రాన్ని వేసిన ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలిగారికి, ముఖపత్రాన్ని ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీ టి. మల్లేల్గారికి, ఓపిగ్గా డి.టి.పి. చేసిన శ్రీ కె.బి.టి. కొండయ్యగారికి, సకాలంలో అచ్చువేసిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి నా కృతజ్ఞతలు.