INUPA KACCHADALU - THAPI DHARMARAO by THAPI DHARMARAO Telugu book cover

INUPA KACCHADALU - THAPI DHARMARAO

by THAPI DHARMARAO

₹35
In stock · 259 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సిగ్గుబిళ్ల పూర్వాపరాలు ఇనుపవకచ్చడాలు - ఇంత కాలానికి విశాలాంధ్ర ప్రచురణాలయం వారు తీసుకొచ్చారు. తాపీ ధర్మారావుగారు జీవించి ఉన్న కాలంలోనే వీరు దీన్ని ప్రచురించాలని చాలా ప్రయత్నం చేశారు. సఫలీకృతులు కాలేక పోయారు. కాగడా వారపత్రికలో జనవరి 1940 నుండీ జూలై 1940 వరకూ ఈ వ్యాసాలు అనాడు ప్రకటితమౌతుంటే పాఠకులు విశేషమయిన అసక్తిని కనబర్చారు. ఈ నూతన భావాల ప్రచారంతో క్రమంగా పత్రిక సర్క్యులేషన్ ఊహకందని విధంగా పెరిగింది. ఆ వ్యాసాల రుచి చూసిన వాళ్ళంతా అవన్నీ ఎప్పుడెప్పుడు పుస్తకరూపంగా వస్తాయా! అని ఇన్నేళ్ళూ ఎదురు చూశారు. ఇప్పటికొచ్చింది. తాపీ ధర్మారావుగారు ఈ వ్యాసాలను అనాడు ప్రచురించటంలో ఓ ఉద్దేశం వుంది. అంతవరకూ తాతాజీ; అటు భాషా పరంగానూ భావాల పరంగానూ ఒక అంచుకుంటూండేవారు. పాండిత్యమన్నది ఒక వర్ణానికే చెందిందనుకుంటున్న సనాతన భావం అయన్ను కలతపెట్టింది. దాంతో, అ వర్ణాన్ని ఎదుర్కోటానికి అ పద్ధతిలోనే పాండిత్యం సముపార్జించుకున్నారు. వారిలాగే భాషా చర్చా - ప్రబంధాల అధ్యయనం పాఠనిర్ణయాలపై వాదోపవాదాలూ చేయటం మొదలెట్టారు, భాష కూడా ఆ వర్ణాలకే ప్రాతినిధ్యం వహిస్తూందన్న భావంతో అలాంటి వీర గ్రాంధికవాదిగా ఉంటేనే అ వర్ణంకన్నా గొప్పవాళ్ళం కాగలమనుకున్నారు. ఇలా ఉండగా - కొంతకాలానికి ఇతరదేశాల సాహిత్యం తనకు అందుబాటులో కొచ్చింది. జమీందార్ల కొడుకులకు ట్యూషన్ చెపుతూన్న సమయంలో జమీందార్లతో సంబంధాలేర్పడ్డాయి. ఇవి వీరికి అనేక దేశాల గ్రంథాలు తను అధ్యయనం చేయటానికి అవకాశం కల్పించాయి.