IPPUDE VASTA KATHALU by HANEEF Telugu book cover

IPPUDE VASTA KATHALU

by HANEEF

₹100
In stock · 11 available
PublisherASIF PRACHURANALU
LanguageTelugu
ISBN9789355934093
డెబ్భై యేళ్ల స్వతంత్ర పాలన మిమ్మల్ని ఫకీరుల్నీ, కటిక పేదల్నిగా తయారుచేసి పెట్టింది,” అంటాడు ఈ కథల్లోని ఒక పాత్ర. లోపం డెబ్భై యేళ్లలోనూ, స్వాతంత్య్రంలోనూ లేదు; లౌకికతని ఆదర్శాల ప్రదర్శనకి పరిమితం చేసి, ఓట్లకోసం లౌక్యంగా సాగిస్తున్న పాలనల్లో ఉంది. చేయిపట్టుకుని నడవాల్సిన సందర్భాలన్నిటినీ విస్మరించి, వేలెత్తి చూపించే ఆధిపత్యమే రాజ్యమేలడంలో ఉంది. ఉన్నచోటే పరాయి మనుషులుగా మసలాల్సిన దుఃఖాన్ని రగిల్చింది. మానవత్వం కంటే మతతత్వమే ముఖ్యమైపోయింది. ఈ ఆవేదనంతా హనీఫ్ కథలకి వస్తువయింది. ముస్లిం కుటుంబాలు అనుభవిస్తున్న అలాంటి వివక్షనీ, ఆవేదననీ చిత్రించడంలో ఆ కుటుంబాలని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నంతో పాటు, ఆయా జీవితాలలో నిక్షిప్తమై ఉన్న సంక్షోభాలనీ, అన్యాయాలనీ సంవేదనా సహితంగా అందించడం ద్వారా చదువరుల్లో కొంతైనా కదలిక తీసుకురావడానికి హనీఫ్ తనవంతు ప్రయత్నాన్ని శక్తిమేరకు చేస్తున్నాడు. ఈ సంపుటిలో సగానికి పైగా కథలు ముస్లిం కుటుంబాలకి చెందినవైవుండటం దానికి ఒక తార్కాణం. చావబోతున్న గొర్రెలూ, జన్మించబోయే ప్రాణులూ జీవికకీ, జీవితానికీ ప్రతీకలైన ఒక కథలో జీవన వాస్తవికతలోని వైరుధ్యం కనిపిస్తుంది. ఎక్కాలంటే పుస్తకాల్లోని లెక్కలే కాదనీ, సంఘపరమైన ఎకసెక్కాలని తట్టుకుని నిలబడగల స్థైర్యమూ, మనిషితనమూ అని మరోకథ చెబుతుంది. చాలా కథల్లో మతసామరస్యం పట్ల రచయిత తపన, ఆశావాదం కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడున్న జీవితాలు ఇంతకన్నా బాగుండాలన్న తాపత్రయం, ఇప్పుడున్న పరిస్థితులు మారాలన్న బలమైన కోరిక ఈ కథల్లో కనిపిస్తుంది. అటువంటి మార్పు అభిలషణీయమే కాదు; దానికోసం సాహిత్యపు దారుల్ని పరుస్తున్న హనీఫ్ వంటి రచయితలు అభినందనీయులు కూడా.