
IRLACHENGI KATHALU
₹130
In stock · 48 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Irlachengi Kathalu by Prof. Mahasamudram Devaki మాండలికాలు ఎప్పుడు చదివినా ఉట్టిదించని గడ్డపెరుగులా మధురంగా వుంటాయి. పల్లెల్లో ఇంకా మిగిలిన పచ్చటి మాండలికాలు దేవకిగారి కథల్లో శ్రీవారి వక్ష స్థలంలోని పచ్చలా మురిపిస్తుంటాయి. బాల్యం ఎప్పుడూ అపురూపమే. ఈ కథల్లో ఇసుకలో పురుగులు పరుగులు తీస్తుంటే మనసు పొరల్లో కదిలే గతకాలపు గుర్తులు, గాలిలో పూరెక్కలు ఎగురుతూ వుంటే రెపరెపా అల్లల్లాడే తీరని ఆశలు, ఎండలో నీడలు కదిలిపోతూ వుంటే కనిపించీ కనిపించని మరణించిన బంధువుల జాడలు, చెవుల్లో రొదపెడుతూ ఎవరెవరివో మాటలూ వినిపిస్తాయి. ఈ కథలు తామరతూడులు. తేనె తుంపర్లు. తెల్లవారి వెలుగులు. తియ్యటి ముద్దులు. వెచ్చని కన్నీళ్లు. కమ్మని ఆనంద బాష్పాలు. ఇప్పటి నగర దుఃఖాలకు, నిట్టూర్పులకు ఓదార్పు మాత్రలు. నగరం ఒక ఆక్టోపస్ లా విస్తరించి వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్న సంక్షుభిత భయద భీకర జీవితంలో ఈ కథల పఠనం ఒక చక్కటి ఉపశమనం. డా|| కంపల్లె రవిచంద్రన్