ITLU O AADAPILLA by SUNITHA GANGAVARAPU Telugu book cover

ITLU O AADAPILLA

by SUNITHA GANGAVARAPU

₹60
In stock · 23 available
PublisherSUNITHA GANGAVARAPU
LanguageTelugu
Itlu 'O' Aadapilla ఊహల్ని నిజాలు చేసుకోవడానికి కూడా ఉద్వేగం అవసరం. ఒక చైతన్యం రక్తంలా ప్రవహించడం అవసరం. ఎంత తీరికలేకున్న దౌర్జన్యాల్ని నిరసించే గళం వినబడుతూనే ఉండాలి. అసమానతల్ని, అవమానాల్ని, అణచివేతల్ని అక్షరబద్ధం చేస్తూనే ఉండాలి. తలరాతల్ని, గీతల్ని, అజ్ఞానానికి ఆనవాళ్లని విసిరి పారేయాలి. స్వప్నం లేకపోవడం, క్రోధం రాకపోవడం, పొగలు సెగలు కక్కి లావాలా విరజిమ్మక పోవటం ఒక మరణం... మరణాన్ని జయించేది లిపి. నాకు ముందు మాటలు, వెనుక మాటలు రాయడం రాదు. సునీత ! చిన్నప్పటి జ్ఞాపకం, ఆకుటుంబంతో అనుబంధం కంటే, కవితల్లో నిజాయితీ, తపనకు స్పందనగా ఈ నాలుగక్షరాలు. దేవి సునీత బాలకవయిత్రి దశలోనే కవితాకళ నేర్చుకొని ఉంటుంది. ఈ విద్య తల్లిదండ్రులు, గురువులు, పాఠశాల పరిసరాలు నుంచి తమకు తెలియకుండానే అబ్బి ఉంటుంది. అందుకే రచనలో అందెవేసిన చెయ్యిగా తొలి పుస్తకంలోనే నిరూపించుకుంది. “ఒక్క నిమిషం" మళ్ళీ చదవండి అందులో ఆమె తన అస్థిత్వాన్ని, తన అక్షర నేపధ్యాన్ని, తన సామాజిక చైతన్యాన్ని సృష్టపరిచింది. ఈమధ్య కాలంలో ఇంత బలంగా కవిత్వం చెప్పిన ప్రకాశం జిల్లా కవయిత్రుల్ని వేళ్లమీద లెక్కించవచ్చు. ఎండ్లూరి సుధాకర్