
J.V.RAMANAMURTHY GARI DARSHAKATVAMLO KANYASHULKAM NATAKA PRADARSHANA
₹100
In stock · 4 available
PublisherPOTTI SRIRAMULU TELUGU VISWAVIDYALAYAM
LanguageTelugu
ముందుమాట పోచంబావి గోపీకృష్ణ రచించిన "జె.వి.రమణమూర్తి గారి దర్శకత్వంలో కన్యాశుల్కం నాటక ప్రదర్శన" అన్న పరిశోధనా వ్యాసాన్ని ఆసాంతం చదివాను. ఇందులో భాష సరళంగా ఉంది. భావం నిండుగా ఉంది. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడం జరిగింది. తన పరిశోధనాంశంలో 'కన్యాశుల్కం' నాటకాన్ని స్వీకరించడంలోనే, గోపీకృష్ణ ఆలోచన ఆవిష్కరించబడింది. నూరేళ్ళు నిండితే మనిషి జీవితం ముగిసినట్లే. నూరేళ్ళు దాటినా ఇప్పుడే పుట్టిపెరిగిన యవ్వనవతిలా ఇంకా ప్రేక్షకులను అలరిస్తున్న నాటకం కన్యాశుల్కం. జె.వి.రమణమూర్తి గారంటే ముందు గుర్తుకు వచ్చేది సినిమాకాదు, కన్యాశుల్కం నాటకమ్. పూవు వాసన దారానికి అబ్బినట్టు 'కన్యాశుల్కం' మేలిమి రమణమూర్తి గారిని ඩේරයි. తెలుగు నాటక రంగంలో కన్యాశుల్కం పాత్రను మొదటి అధ్యాయంగా స్వీకరించడం, కన్యాశుల్కం నాటకరంగంలో తెచ్చిన మార్పులను అందులో చర్చించడం, అందులోని పాత్రల పరిశీలన, ముఖ్యంగా స్త్రీ పాత్రల గురించి విశ్లేషించడం చక్కగా ఉంది. సమకాలీన సమస్యలతో నాటకం -సామాజిక ప్రయోగాలు రెండవ అధ్యాయంగా స్వీకరించాడు. తెలుగు నాటకరంగంలో జె.వి.రమణమూర్తి స్థానాన్ని నిర్వచించి, ఆ వెనుక ఆయన దర్శకత్వ ప్రయోగాల గురించి చెప్పడం బాగుంది. చక్కటి సామాజిక ప్రయోజం ఉన్న నాటకాన్ని స్వీకరించి, సామాజిక అవగాహన ఉన్న దర్శకుడు ఆ నాటక శిల్పాన్ని ఎలా రచించాడో స్పష్టంగా చెప్పిన గోపీకృష్ణ అభినందనీయుడు.