JABILAMMA PADALU by S.CHANDRAMOULI Telugu book cover

JABILAMMA PADALU

by S.CHANDRAMOULI

₹20
In stock · 4 available
PublisherS.CHANDRAMOULI
LanguageTelugu
ఆకాంక్ష చిన్ని మేధస్సులలో చిన్ని, చిన్ని మాటలతో బలమైన సమాజిక స్ఫూర్తిని కల్గించే చిరు ప్రయత్నమే 'శ్రీపద' కలం నుండి జాలువారిన ఈ 'జాబిలమ్మ పదాలు', చిన్నారులకు అమ్మ చూపించే అందమైన బొమ్మ జాబిలమ్మ. అందుకే వడిచర్ల సత్యం ఆ జాబిలమ్మ పదాలతో సత్యపు లోతును చూపించాడు నేటి చిన్నారులకు. పైకి చిన్నగా కన్పించినా ఇది గొప్ప నీతిప్రబోధక రచన అనవచ్చు. ప్రాథమికస్థాయిలో విద్యను సులభంగా అభ్యసించడానికి సరళపదాలుగల తెలుగువాచకం "అక్షరాలతో ఆడుకుందాం" (2008) అంటూ ఆటకు రమ్మనట్లు అధ్యయానికి పిలిచాడు చిన్నారులను ఈ వడిచర్ల. బాలలకోసం ప్రత్యేకంగా రచించిన “విప్పుచెప్పుబాల" అనే పొడుపుకథల శతకం ను 2009లో ఆంధ్రప్రదేశ్ రాజీవ్ విద్యామిషన్ (SSA) వారు ప్రచురించారు. ఈ కృతి ఆరంభంలో కవి గణనాయకునికి నమస్కరిస్తూ, తన ఇష్టదైవాలైన, వేంకటేశుని గొలుతునన్నాడు. షిర్డిసాయిని పిలుతునన్నాడు. " శ్రీ వి.మాసయ్య పిత / లక్ష్మమ్మ కతడు జత/నేను వారి కడసుత" అంటూ అంత్యానుప్రాసతో తల్లి, దండ్రులను స్మరించాడు. నవ్యకవుల స్ఫూర్తితో, మాత్రాఛందస్సుతో శిశు హృదయాలను చిగురింపజేసాడు. "మంచిమనసులు తెలుపు / మంచిమాటలు తెలుపు / మంచి చేతలు తెలుపు" అంటూ 'మంచి'ని గూర్చి పిల్లలకు పాలు త్రాగించినట్లు చెప్పాడు సత్యం. "అప్పును గూర్చి "అధికమైతే అప్పు / బ్రహ్మకైనా ముప్పు అంటూ అద్భుతంగా ఆవిష్కరించాడు. "నోరు జారిన మాట / కూలిపోయిన కోట" అంటూ నోరుజార వద్దని భయపెట్టాడు. అదేవిధంగా మద్యం గూర్చి హాస్యస్ఫూరకంగా, అందంగా "మందు సీసలు చెంత / నున్నవాడును కొంత / తవ్వుకున్నడు గుంత" అన్నాడు. బాలికల విద్యను ప్రోత్సహిస్తూ, అందంగా, అమోఘంగా “చదువుకున్న బాలిక / సుగంధాల మాలిక / దేశానికి యేలిక" అన్నాడు. ఆ ఇందిరమ్మను, సోనియమ్మను, ప్రతిభమ్మల ప్రతిభను సందేశాత్మకంగా చెప్పాడు వడిచర్ల. "గతంలో బర్డూ/ ప్రస్తుతం స్వైన్ఫ్లూ/భవితయె డేంజరూ" అంటూ స్వభావోక్త్యలంకారంతో ప్రస్తుత ఆరోగ్య సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించాడు వడిచర్ల. హృదయ వీధిలో ఎన్నెన్నో భావాలు వడివడిగా పరుగెత్తాయి.