JABILLI BALALA KADALA SAMPUTI by MRS.V.NAGALAKSHMI Telugu book cover

JABILLI BALALA KADALA SAMPUTI

by MRS.V.NAGALAKSHMI

₹111
In stock · 1 available
PublisherKOSANAA CULTURAL ACADEMY
LanguageTelugu
బాల కథల పరిమళాల మల్లి నాగలక్ష్మిరాసిన 'జాబిల్లి' కేంద్రసాహిత్య అకాడమి బాలసాహితి పురస్కార గ్రహీత చొక్కపు వెంకటరమణ అధ్యక్షులు, బాలసాహిత్య పరిషత్ చిన్న వయసులోనే ప్రతిభ చూపడం. ఉద్యోగం సంపాదించడం స్థిరమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగడం. ఇదీ మారుతోన్న కాలం తీరు ఆ స్థాయిలో రాణించాలంటే ఒత్తిడి లేని చదువు పిల్లలకు అందాలి ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి ఆరేళ్ళ వయసు వరకు తీసుకుంటే ఒక్క చదువే కీలకం కాదు. విలువలు, మర్యాదలు, ఇచ్చి పుచ్చుకొనే మనస్తత్వం అలవడే వయసది. ఎటువంటి ఆంక్షలు లేకుండా నింగి నీడలో, ప్రకృతి ఛాయలో చక్కగా ఆడిపాడుతూ, చదువుకో వాల్సిన కాలమది. దానిని దృష్టిలో ఉంచుకొని తల్లి దండ్రులు పిల్లలకు అనువైన విద్యా విధానాన్ని, పాఠశాలను ఎంపిక చేసుకోవాలి అంటుంటారు. రచయిత్రి వి. నాగలక్ష్మి. పసి పిల్లలకు, ఆరేడేళ్ళ లోపు పిల్లలకు సెన్సోరియల్ ఎక్స్ ప్లోరర్ అధికంగా ఉంటుంది. అంటే దేన్నయినా సరే చూసి, తాకి, విని, రుచి గ్రహించి తమదైన పరిజ్ఞానాన్ని ఏర్పరచుకుంటారు. అది ఆ వయసు వారికి మాత్రమే ఉండే అద్భుత శక్తి. అలాంటి శక్తిని తన మనవడు 'అజయ్ వైభవ్'లో గుర్తించిన రచయిత్రి వి. నాగలక్ష్మి గోరుముద్దలతో కథలు 'తిని'పించడం మొదలెట్టారు. అలా అనేక రకాల కథలు 'తిన్న' వైభవ్ కొత్త కథలు చెప్పమని అమ్మమ్మ నాగలక్ష్మిని వత్తిడి చేసేవాడు. అంతేకాదు. తనకు ఎలాంటి కథలు కావాలో.... ఆ కథల్లో పాత్రల తీరుతెన్నులు ఎలా ఉండాలో సూచించేవాడు. ఆ పసి వైభవ్ ఊహల నుంచి పుట్టిన పాత్రల ప్రతిరూపాలతో అల్లిన కథలు పండు వెన్నెల వెదజల్లే సంపుటి ఈ 'జాబిల్లి'