
JACK LONDON KATHALU
by DR.CHELIKANI RAMARAO MEMORIAL COMMITEE
₹10
In stock · 441 available
PublisherDR.CHELIKANI RAMARAO MEMORIAL COMMITEE
LanguageTelugu
జగమెరిగిన గొప్ప కథకుడు జాక్ లండన్. ఆయన రాసిన రెండు కథల అనువాదాలీ చిరు పుస్తకం. మొదటి కథను శ్రీ బి. సుభాష్ బాబు 'ముసలాళ్ళ జట్టు' పేరుతో అనువదించారు. ఈ కథలో జాక్ లండన్ 'అభివృద్ధి' అనేది అందరి అభివృద్ధి కానక్కర్లేదనే గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తాడు. పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగే 'అభివృద్ధి' వెనుకబడిన వర్గాలు, ప్రజా బృందాలకు ఎలా నష్టంచేసి నాశనం చేస్తుందో గొప్పగా వెల్లడించాడు. శ్రీ వి. విజయకుమార్ అనువదించిన 'నిప్పు రాజేయడం కోసం' మరొక మౌలిక సత్యాన్ని తెలుపుతుంది. మానవులు సమిష్టిగా కృషి చేసి మాత్రమే ప్రకృతిని తనకు అవసరమైన విధంగా మార్చగలిగారనేది మార్క్స్ చెప్పిన సత్యం. సమిష్టి భావన లేని ఒక వ్యక్తి భయంకరమైన అంధ ప్రకృతి శక్తి క్షేత్రంలో ఒంటరిగా ప్రవేశించి చేసిన పోరాటాన్ని అత్యద్భుతంగా చిత్రించాడు జాక్ లండన్. చక్కని అనువాదాలు.. చదివి చూడండి.