
JADI
₹100
In stock · 10 available
PublisherDR.K.S.RAMANA
LanguageTelugu
జాగ్రత్తగా శ్రద్ధగా మగ్నతతో లోతుగా చదవాల్సిన బహుకొద్దిమంది కవుల్లో కె.యెస్. రమణ ఒకరు... అతని వస్తుమగ్నత, రూపనిర్వహణ- దానికి సంబంధించి అతనెన్నుకున్న విధానాలు అపురూపం, అనూహ్యమనిపించటం అందుకు కారణం... ప్రతిపదాన్ని ఒక తపస్సులా, ఒక జీవన సమాధి నుంచి పలుకుతున్నట్టు -ఏ పద్యానికాపద్యం ఒక మహాకావ్యమయినట్టు నిర్వహించటం చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త పరిశీలన, నన్నాకట్టుకునే లక్షణం -క్రమక్రమంగా పాఠకుణ్ణి involve చేసే లక్షణం - కవి ఎంత తీవ్రంగా తనెన్నుకున్న వస్తువులో లీనమౌతాడో ఎన్ని రూపాలుగా దాన్ని, దృశ్య దృశ్యాలుగా మనకి అందిస్తాడో - అది అతని ఈ మూడు దశాబ్దాల పైచిలుకు కవిత్వ సాధనకి సంబంధించింది. Peripheralగా అలా అంచుల చుట్టూ తిరిగి పలకటం రమణ తత్వం గాదు. ప్రతిదీ తనలోకి sink అయిన తర్వాతే, ఎప్పుడో అతని రక్తంలోంచి ఆ అగ్ని పుష్పమో, వెన్నెల సముద్రమో విచ్చుకుంటుంది. భాషమీద ఒక నియంత్రణ, అధికారం పదపదానికీ, పదబంధానికీ ప్రతిమలకీ, ప్రతిబింబాలకీ సంబంధించిన తీవ్రమయిన దృష్టి వుంది. ఒక imagel conceive చేసే విధానంలోనే, దాన్ని కవితలో తానెన్నుకున్న స్థానంలో పొదిగే విధానంలోనే రమణ విలక్షణత కన్పిస్తుంది. దేనికీ తను బయట వుండడు. తను బతుకుతూ గాఢంగా లీనమయి, అనుభవించి, వడకట్టి మనకి కవితలుగా యిస్తాడు.