
JAGANNATAKAM KATHALU
by V.V.N.MURTHY
₹30
In stock · 7 available
PublisherVIRAT PRACHURANALU
LanguageTelugu
చాలా మంచి కథల్ని రాసిన వారిలో వివినమూర్తి గారొకరు. రచనను ఒక తపస్సుగా స్వీకరించిన మూర్తి కథలకు రావలసినంత గుర్తింపు వచ్చిందా అన్నది నా మీమాంస. మంచి రచయితలందరిలానే మూర్తి సాహిత్య సృజనకూ ప్రమాణం జీవితమే. మరి తేడా ఎక్కడ? జీవితానికి నిర్వచనం అందరి రచయితలదీ ఒక్కటి కాదనుకుంటాను. సాహితీకృషిలో ఆయా రచయితల కృషిని బట్టి, ఆయా రచయితల స్థాయిని బట్టి తేడాలుంటాయనుకుంటాను. కొందరికి తనకీ, తనవారికీ, లేదా తన ఎరికలో వారికి బ్రతుకుపోరులో ఎదురైన చేదూ తీపీ అనుభవాల సమాహారమే జీవితం. మరికొందరికి జీవితమంటే వర్తమానంలో తాము విన్న కన్న తమ ప్రాంతం వారివీ, తమ వర్గం వారివీ లేదా తమ తరగతి వారివీ, జాతి వారివీ బ్రతుకుల్లో అనుభవాలూ, సమస్యలూ పరిణామాలూ వాటిని గూర్చిన అవగాహనే మానవ జీవితం. వివిన మూర్తికి జీవితం అంటే ఉండే అవగాహన కొంత భిన్నంగా ఉన్నట్టనిపిస్తుంది. నేటి వ్యక్తుల జీవితాలైనా, కుటుంబ జీవితాలైనా ఆయా ప్రాంతాల్లో తెగలూ వర్గాలూ జాతుల సామూహిక జీవితాలైనా మనిషి పుట్టినప్పటి నుండీ యుగయుగాలుగా సాగుతూ వస్తున్న అవిచ్ఛిన్న మానవ మహాజీవిత ప్రవాహంలో భాగాలు. వాటిని పరిశీలించేటప్పుడూ, అవగాహన చేసుకునేటప్పుడూ పై అంశాన్ని గుర్తు పెట్టుకోవడంతో పాటు ఆ ప్రవాహం నిత్య నూతనం. దానికి గతం వర్తమానంతో పాటు భవిష్యత్తూ ఉ ంటుంది - అన్నది అతని అవగాహనగా నాకు తోస్తుంది. జీవితం గురించి పరిమిత అవగాహనతో జరిగే సృజనకూ, విస్తృత అవగాహనతో జరిగే సృజనకూ వెసులుబాట్లలో తేడా ఉంటుంది కదా! అలానే పాఠకుల్ని ఒప్పించి మెప్పించడంలో చిత్రణకూ, వ్యాఖ్యానానికీ రచయిత తీసుకోవలసిన శ్రమ, చూపవలసిన నేర్పులలో తేడాలుంటాయి. అందుకే కృష్ణస్వప్నం, జగన్నాటకం వంటి కథలు రాసే వివిన మూర్తినీ, అటువంటి రచనలు చేసే యితర రచయితలనూ చదివేటప్పుడు వారి రచనలను యితోధిక శ్రద్ధతో చదవడంతో పాటు ఆ రచనల వెనుక రచయితలను సానుభూతితో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. రచన సాఫల్యతకు సంబంధించిన బాధ్యత రచయితలపైనే కాదు పాఠకులపైనా ఉంటుంది. కాళీపట్నం రామారావు