
JAGTERAHO-50
₹50
In stock · 5 available
PublisherCHALASANI PRASADARAO
LanguageTelugu
జాగే రహో 1997-2000... మరో నాలుగేళ్లు...! ఇరవై శతాబ్దాలు పూర్తవుతాయి! రెండువేల సంవత్సరాలు గడచినట్లవుతుంది. ఇవి క్రీస్తుశకం లెక్కలు! క్రీస్తుకు పూర్వపుమరెన్ని శతాబ్దాలు, మరెన్ని వేల సంవత్సరాలు... కలుపుకుంటే...? ఈ లెక్కల కందని మరెన్నో వేల సంవత్సరాల మానవ పరిణామక్రమ చరిత్రను గణించుకుంటే...? మనం ఎక్కడ బయల్దేరాం? ఏ దారిన నడిచాం! ఏం సాధించాం? ఎటు వెళ్తూ ఉన్నాం? ఎందుకు పయనిస్తూ ఉన్నాం? ఏం సాధించబోతున్నాం? రాసేవాడు మనిషి....! చదివే వాడు మనిషి! అతనెలా రాయగలుగుతున్నాడు.!... ఇతనెలా చదవగలుగుతున్నాడు. ఆ చేతిలోని కలం ఎలా వచ్చింది ఈ కలం క్రింది కాగితం ఎక్కడి నుండొచ్చింది? ఆ చదివించే పత్రికకూ, ఈ చదివే కళ్లకూ మధ్యనున్న కళ్లద్దాలెలా రూపొందాయి? వీటన్నింటినీ ఆలోచించగలిగిన మేధ ఆ స్థాయికి ఎలా వికసించింది? ఆ స్థాయిని స్వంతం చేసుకున్న ఆ మనిషి ఈ 'మనిషి'గా మరింత మహోన్నతంగా ఎలా ఎదిగాడు? తన మేధ సూచించిన వాటినెలా వాస్తవం చేయగలిగాడు. ఆ వాస్తవాల జగత్తును తన సౌకర్యానుగుణంగా ఎలా మలుచుకోగలిగాడు? 'మనిషి' సాధించిన మహత్తరాంశాల జాబితా నిప్పుడు వల్లె వేసుకోనక్కర్లేదు. అవన్నీ మనముందే ఉన్నాయి ప్రత్యక్షంగా! వాటిలో కొన్నింటిని కొందరనుభవిస్తున్నా రు. అన్నింటిని ఇంకొందరనుభవిస్తున్నారు. వేటినీ కూడా అనుభవించగలగటం లేదింకెందరో! ఆ కొందరు, ఈ కొందరు, ఇంకెందరో, అందరూ మనుషులే! ఈ ప్రపంచాన్నిలా తీర్చిదిద్దిన వారే! నడిపిన వారే నడుపుతున్న వారే! హక్కున్న వారే! మనిషి... అంటేనే చైతన్యం! మనిషే ప్రగతికి మూలం! ఈ చరాచర జగత్తుకు అధినాధుడతనే!