
JAI BASAVESWARA PADHYA NATAKAM
₹60
In stock · 13 available
PublisherDR.MEEGADA RAMALINGA SWAMI
LanguageTelugu
సీ॥ బసవేశ్వరా! నీదు వచనామృతమ్ముచే వీరశైవమ్మిలన్ విస్తరించె బసవేశ్వరా! నీదు వచనామృతమ్ముచే మానవత్వపు రుచుల్ మహిని వెలసె బసవేశ్వరా! నీదు వచనామృతమ్ముచే అజ్ఞాన తిమిరమ్ములంతరించే బసవేశ్వరా! నీదు వచనామృతమ్ముచే కులమారణమ్ములు కూలిపోయె బసవేశ్వరా! నీదు వచనామృతమ్ముచే మత మారణమ్ములు మాయమయ్యె గీ॥ కులమదొక్కటే శివభక్త కోటికంచు జగతి జనులకు శివమును చాటినట్టి సమసమాజ నిర్మాణసంస్థాపనార్య పరమ శివతేజ! సాక్షాత్తు బసవరూప!